ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాసనకు అంతా సిద్దమవుతోంది. చరిత్రలొ నిలిచిపోయే ఘట్టానికి. చరిత్ర కూడా గుర్తించుకునేలా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మొన్నీమధ్యన చేసిన గోదావరి పుష్కరాలు ఎంత గ్రాండ్ గా చేశారో అందరికి గుర్తుంది. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా.. ఎంత ఖర్చైనా గ్రాండ్ గా చెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అయితే బాబుగారు చేసే గ్రాండ్ ఫంక్షన్ గురించి ఎవరూ విమర్శించకపోయినా.. ఖర్చు గురించి మాత్రం ఖచ్చితంగా విమర్శలకు తావిస్తోంది. మరి అమరావతి శంఖుస్థాపన సందర్భంగా చేసే ఖర్చుల మీద ప్రస్తుతం చర్చ సాగుతుంది. చంద్రబాబు ఎంత ఖర్చు చేస్తున్నారు.. పది కోట్లా..? వంద కోట్లా.? ఇది తెలుగునాట ప్రధానంగా చర్చకు తెర తీసింది. మరి నిజానికి ఎంత ఖర్చు చేస్తున్నారు. తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.
రాజధాని శంకుస్థాపకు 10 కోట్ల మించి ఖర్చు చేయడం లేదని మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి కూడా ఇదే చెప్పారు. అయితే, వాస్తవం వేరు. సర్కారు దాచాలని చూసినా శంకుస్థాపన ఆర్భాటం దాగడం లేదు. శంకుస్థాపనకుకు వివిధ శాఖలు చేస్తు న్న ఖర్చు, కాంట్రాక్టు ఏజెన్సీలకు చెల్లిస్తున్న నిధుల వివరాలను మీడియా సేకరించింది. విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్న అధికార, అనధికార వర్గాలు ఇస్తున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ప్రముఖల రవాణా 199కోట్లు, భోజనాలకు 77కోట్లు.. రోడ్లు, విద్యుదీకరణకు 110 కోట్లు ఖర్చు అవుతుంది. వేల సంఖ్యలో వినియోగించనున్న పోలీసు సిబ్బంది ఖర్చు దీనికి అదనం.
చంద్రబాబు అమరావతి శంఖుస్థాపన కోసం ఇలా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఖర్చులు..
ప్రముఖుల రవాణా కోసం.. ........................199కోట్లు
ప్రముఖుల బస కోసం...............................1కోటి
వివిఐపి, విఐపిల భోజనాల కోసం............... 77 కోట్లు
సభా ప్రాంగణం కోసం................................8కోట్లు
లైటింగ్, ఆర్ట్ కోసం................................ 10 కోట్లు
రోడ్లు, వాటి విద్యుదీకరణ.......................... 110కోట్లు
ప్రచారం కోసం...................................... 30కోట్లు
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more