Telangana Student Sandesh Murder in amedhi university

Telangana student shot dead by friend in noida

Telangana Student, telugu student, telugu student sandesh shot dead, Telangana Student Shot dead, Student Sandesh Murder, Telangana Student Sandesh Murder, Amity University student, telangana student sandesh, Amedhi university, group fighting in amedhi university, student dead in group fight in amity university, telangana student, sandesh, murder, shot dead, group fight

Telangana student Shot dead by Friend in Noida. The victim is a second year student from Amity university. Group fight is said to be the reason the killing.

నోయిడా.. అమెటీ విశ్వవిద్యాలయంలో గ్రూప్ ఫైట్.. తెలుగు విద్యార్థి దారుణ హత్య..

Posted: 10/18/2015 01:49 PM IST
Telangana student shot dead by friend in noida

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో హోరం జరిగింది. పాశ్యాత సంస్కృతితో పాటు అక్కడి గన్ కల్చర్ ను కూడా ఉత్తరప్రదేశ్ యువత అలవర్చుకుంటున్నారనడానికి ఈ ఘటన సాక్ష్యం. అసలే అటవిక రాజ్యంగా ముద్రపడిన ఉత్తర్ ప్రదేశ్ లో విద్యార్థులు కూడా అదే బాట పడుతున్నారనడానికి ఇది ఉదాహరణ. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదాలు ఓ విద్యార్థి నిండు నూరేళ్ల జీవితాన్ని బలి తీసుకుంది. తెలుగు విద్యార్థి రామరాజు సందేశ్‌ హత్యకు గురయ్యాడు. అమేధీ యూనివర్శిటీలో సందేశ్‌ బీఎస్సీ మెరైన్స్‌ ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఆయన స్వస్థలం నల్గొండ పట్టణం శ్రీనగర్‌ కాలనీ. అదే వర్శిటీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తుపాకీతో కాల్చి చంపారు.

తలకు బలమైన గాయాలు కావడంతో సందేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేశారు. దీంతో వారు హుటాహుటిన ఉత్తరప్రదేశ్‌ చేరుకున్నారు. చదువుకోసం సందేశ్‌ తన సేహితులతో కలిసి రూమ్‌ తీసుకున్నాడు అందులో మొత్తం ముగ్గురు ఉంటున్నారు. ఈ ఘటనతో తోటి విద్యార్థులు రూమ్‌లో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సందేశ్‌ మృత దేహానికి ఆదివారం పోస్టుమార్టం జరగనుంది. అనంతరం మృతదేహాన్ని సందేశ్‌ తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana student  sandesh  murder  shot dead  group fight  

Other Articles