18 yrs old gangraped after husband and friend made her booze liquor forcibly

18 yrs old gangraped by sister s husband and friend

18 yrs old gangraped in hyderabad,18 yrs old gangraped by sister's husband and friend, made her booze liquor forcibly, sister's husband, 18 yrs old girl, gangraped, sister's husband, friend, arrested, Usman, Piyush, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

18 yrs old gangraped by sister's husband and friend who abducted her and made her booze liquor forcibly and gang raped her in a lonely place

హైదరాబాద్ లో దారుణం.. మరదలిపై బావ, అతని స్నేహితుడు అత్యాచారం..

Posted: 10/18/2015 02:23 PM IST
18 yrs old gangraped by sister s husband and friend

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. తెలంగాణ రాజధాని నగరంలోని సబర్మతినగర్‌లో నివసించే పద్దెనిమిదేళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలి ఆమె బావ ఉస్మాన్‌ (36), అతడి మిత్రుడు పీయూష్‌ (29) ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మెహిదీపట్నంలోని అక్క ఇంటికి ఆమె ఆటోలో వెళ్తుండగా అడ్డుకుని, బాధితురాలిని తమ ఆటోలోకి ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలి చేత బలవంతంగా మద్యం తాగించి, అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత గాంధీనగర్‌లోని ఎల్‌ఐసీ బ్రిడ్జివద్ద వదిలి పారిపోయారు.

అక్క ఇంటికని వెళ్లిన బాధితురాలు అక్కడికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబసభ్యులు తమకు తెలిపిన ప్రదేశాల్లో వెతికారు. చివరకు అమెను అపస్మారక స్థితిలో గుర్తించిన కుటుంబసభ్యులు..గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొలుకున్న బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఉస్మాన్‌, పీయూష్‌లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కాగా తెలంగాణలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఆడపడుచుల కళ్లలో కన్నీళ్లు వస్తే అందుకు కారణమైన వారిని వదిలిపెట్టమని ముఖ్యమంత్రి ప్రకటించారే తప్ప.. అందుకునుగూణంగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 18 yrs old girl  gangraped  sister's husband  friend  arrested  Usman  Piyush  

Other Articles