Special delicious lunch at amaravati inauguration

Delicious lunch at amaravati inauguration

AP, Food, Andhra food, Amaravati, chandrababu, tapeshwaram kaja, Daddojanam, Chakra pongali, Food at Amaravati inauguration, Amaravati Inauguration menu

AP govt arraging special and delicious food at the inaguration ceremony of ap new capital Amaravati. Chandrababu naidu order to supply excelent food to invites.

అమరావతి అంకురార్పణలో అదిరిపోయే రుచులు

Posted: 10/19/2015 04:20 PM IST
Delicious lunch at amaravati inauguration

ఆంధ్రా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి వంటకాలే. అక్కడ దొరికే రుచికరమైన భోజనం ఎక్కడా దొరకదు. ఆంధ్రా వంటకాల ఘుమఘుమల గురించి అనకాపల్లి నుండి అమెరికా దాకా అందరికి తెలుసు. ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు అంతా సిద్దమైన వేళ అందరి చూపు అతిథులకు అందించే ఆతిథ్యం మీదే ఉంది. అతిథులకు ఎలాంటి మెనూ సిద్దమైంది.. ఆంధ్రా వంటకాలు ఏమేమి ఉన్నాయి అని సర్వత్రా చర్చ సాగుతోంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన వారికి ఆరుకాలాలు గుర్తుండేలా అసలు సిసలు ఆంధ్రా రుచికరమైన వంటకాలను వడ్డించనున్నారు. అందరికి నచ్చేలా. అందరి మన్ననలు పొందేలా రూపొందించిన అమరావతి అంకురార్పణ భోజనాలు ఖచ్చితంగా అందరికి గుర్తుండిపోతాయి.

వచ్చిన సాధారణ ప్రజలకు ముందుగానే సిద్దం చేసిన ఆహారం ప్యాకెట్లను అందించేందుకు ఏపి ప్రభుత్వం అంతా సిద్దం చేసింది. ఈ ప్యాక్ లో పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, తాపేశ్వరం కాజా, అరటి పండు ఉంటాయని సమాచారం. అలాగే వీవీఐపీల కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేయనున్నారు. చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వెజ్‌ బిర్యానీ, ఉలవచారు, ఆవకాయ, దప్పళం, పుల్కా, రోటీ, వెజ్ కర్రీలు తయారు చేయనున్నారు. అలాగే జపాన్, సింగపూర్, చైనా ప్రతినిధులకు ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీసీ హోటల్ సహకారంతో కేఎంకే ఈవెంట్ ఆధ్వర్యంలో మెనూ సిద్ధం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం అధికారులు ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఆంధ్రా రుచులు సిద్ధం చేయాలని పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం అందడంతో అందుకోసం అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. అయితే మోదీ నవరాత్రుల ఉపవాస దీక్ష విరమించకపోతే నిమ్మరసం, పండ్లు సిద్ధం చేయాలని కూడా పీఎంవో ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles