Telangana govt announce holiday

Telangana govt announce holiday

Telangana, Holiday, bathukamma, Telangana govt declare holiday, KCR, Narasimhan, Bathukamma celebrations

Telangana govt announce tomarrow as holiday. Telangana govt celebrating bathukamma grandly. Tomarrow Bathukamma celebrations at tankbund in Hyderabad. CM KCR and Governor narasimhan and many more VIPs will aprticipate in this celebrations

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Posted: 10/19/2015 04:23 PM IST
Telangana govt announce holiday

సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ వేడుకల మీద సమీక్ష నిర్వహించి.. రేపటి ఏర్పాట్ల మీద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రేపు సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో భారీ ర్యాలీకి ఏర్పాటు చేసిన కేంద్రం, ఇప్పటికే ట్యాంక్ బండును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. ఎల్ఈడీ లైట్లతో కూడిన బెలూన్లు, ప్రత్యేక బాణసంచా ఏర్పాట్లూ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత బుతకమ్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన కేసీఆర్.. బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పారు.

హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న బుతకమ్మ వేడుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేయగా, రేపు ట్యాక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ఇతర రూట్లలోకి మళ్లించనున్నట్టు పోలీసులు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల మొదటి రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి బతుకమ్మ వేడుకల నిర్వహణకు సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏర్పాట్ల మీద కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles