Hollywood Bold Beauty Angelina Jolie Feeling Very Happy For Getting Close For 50 Years | Hollywood Controversies

Angelina jolie feeling happy for getting close for 50 years

Angelina Jolie news, Angelina Jolie updates, Angelina Jolie controversies, Angelina Jolie affairs, Angelina Jolie wish, Angelina Jolie age, Angelina Jolie wikipedia, Angelina Jolie husband, Angelina Jolie illegal affairs, Angelina Jolie live in relationship

Angelina Jolie Feeling Happy For Getting Close For 50 Years : Hollywood Bold Beauty Angelina Jolie Feeling Very Happy For Getting Close For 50 Years.

దానికోసం తాపత్రయం పడుతున్న ఏంజెలీనా జోలీ

Posted: 10/19/2015 04:43 PM IST
Angelina jolie feeling happy for getting close for 50 years

గ్లామర్ ప్రపంచంలో పేరుమోపిన నటి ఏంజెలీనా జోలీ తాజాగా ఓ ఆసక్తికరమైన కోరికను బట్టబయలు చేసింది. ఇన్నాళ్లు తన మనసులో దాచుకున్న ఆ రహస్యాన్ని దాచుకోలేక చివరికి అందరితోనూ పంచుకుంది. అందిరిలాగే తాను ఒకదానికోసం చాలా తాపత్రయం పడుతున్నానని.. ఆ కోరిక త్వరలోనే తీరబోతోందని అమ్మడు సంబరపడుతోంది. ఇంతకి ఆమె దేనికోసం తాపత్రయం పడుతోంది? అని అనుకుంటున్నారా! అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వయసు పెరుగుతుంటే... ఎవరికైనా కొంచెం ఉత్సాహం.. కొంచెం ఉద్వేగం ఉంటాయి. అదే యాభైలలో పడుతుంటే మాత్రం కొంచెం ఆందోళన ఉంటుంది. అందులోనూ గ్లామర్ ప్రపంచంలో ఉన్న మహిళలకు టెన్షన్ మరింత ఎక్కువే ఉంటుంది. కానీ.. ఏంజెలీనా జోలీ మాత్రం తన వయసు పెరుగుతోంటే ఎగ్జయిటింగ్ గా ఫీలవుతోందట. తన జీవితంలో  మరోమైలు రాయిని అధిగమించడానికి ఆమె  చాలా ఉత్సాహంగా  ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. ‘నాకు ఇపుడు 40సంవత్సరాలు. ఇంకో పదేళ్లలో యాభై ఏళ్లు నిండుతాయి. యస్.. అప్పటివరకూ వెయిట్ చేయలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది ఈ హాలీవుడ్  బ్యూటీ. ఇంతకీ ఆమె 50 ఏళ్ల వయసు కోసం ఎందుకింత ఆత్రుతగా ఉందో తెలుసా..?

ఇప్పటికే ఏంజెలీనా జోలీ కుటుంబీకుల్లో ఇద్దరు మహిళలు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడుతూ నలభైయేళ్ల లోపే చనిపోయారు. అయితే జోలీకి 40 ఏళ్లు అయినా ఆ మహమ్మారి తన దరికి చేరలేదనే ఆనందంతో ఇలా ఉత్సాహంగా ఉన్నట్లు ఉంది. ఇదిలావుండగా.. ఏంజిలీనా అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కాన్సర్ బాధితులే. ఈ నేపథ్యంలోనే ఏంజిలీనా  క్యాన్సర్ రాకుండా ముందుగానే శస్త్ర చికిత్స చేయించుకుంది. గర్భసంచి, రెండు ఫాలోపియన్ ట్యూబులను తొలగించుకొంది. హై రిస్క్ గ్రూప్ లో ఉండడం వల్లనే ఇలా ఆపరేషన్  చేయించుకున్నానని జోలీ బహిరంగంగా ప్రకటించి.. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Angelina Jolie  hollywood news  hollywood bold actress  

Other Articles