విభజన సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కే గానీ భిక్ష కాదని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హోదాకు బదులుగా ప్యాకేజీ అంటే భిక్షాటనతో వచ్చే ఆదాయానికీ హక్కుగా వచ్చే ఆదాయానికీ ఉన్నంత తేడా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయమానసిక ధోరణి వదులుకోవాలని హితవు పలికారు.
ప్రత్యేక హోదా అంటే హక్కు. ప్రత్యేక ప్యాకేజీ అంటే భిక్ష అని అన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పని లేకుండా హోదా ఇవ్వాలి. మనకు రావాల్సిన నిధులన్నింటినీ కలిపి ప్యాకేజీగా ఇస్తే ఉపయోగమేముంటుందని ఆయన ప్రశ్నించారు. రెండు మూడేళ్లుగా బీహార్ రాష్ట్రానికి వివిధ పద్దుల కింది రావాల్సిన నిధులన్నింటినీ కలిపి ప్యాకేజీ ప్రకటించి మభ్యపెట్టారని విమర్శించారు. ప్యాకేజీ అంటే. ఏపీకీ అదే జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తందిశారు.. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా అవశ్యం, అనివార్యమన్నారు. హోదా ఉంటే కొన్ని రాయితీలు వాటంతటవే వస్తాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక పోవడం వల్ల పరిశ్రమలు రావడం లేదన్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు గురువారం రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న వైఎస్సార్సీపీ ఇదే అంశంపై ప్రధానిమంత్రిని కలవాలని ఈ నెల 14న మోదీకి లేఖ రాశామన్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద గానీ, తిరుపతిలో గానీ తమకు సమయం కేటాయించాలని కోరామన్నారు. ప్రధానితో సమయం కోసం బుధవారం ఉదయం కూడా ఆయన కార్యాలయంతో సంప్రదింపులు జరిపామని, అపాయింట్మెంట్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
తమకు అపాయింట్మెంట్ వస్తే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, 67 మంది ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరతామన్నారు. ఒకవేళ తమకు సమయం ఇవ్వకపోయినా రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధాని నుంచి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేలా కృషి చేయాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాస్తే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఉలుకెందుకని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశ్నించారు. హోదా అమలు చేయాలని లేఖ రాయడాన్ని తప్పుపట్టడం గర్హనీయమన్నారు. హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని, ప్రణాళిక సంఘం ఆమోదం ఎందుకు తీసుకోలేదని అప్పటి ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు ప్రశ్నించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేకహోదా అమలవుతున్న 11 రాష్ట్రాల్లో దేనికీ చట్టంలో పొందుపరచలేదని అడిగారు. ఆ విషయాన్ని నిజంగానే చట్టంలో పొందుపరచాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా చట్టం ఎందుకు చేయలేదన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చి ఉంటే 2014 జూన్ 2 నుంచే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలయ్యేదని తులసిరెడ్డి పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more