PM Modi lays foundation stone for Andhra’s new capital

Pm lays foundation stone for andhra capital amaravati

amaravati, andhra pradesh, amaravati capital, chandrababu naidu, andhra capital, guntur, andhra capital city, narendra modi, tdp, andhra new capital, andhra amaravati, ap capital amaravati, amaravathi land breaking occasion, pm narendra modi amaravathi foundation, chandrababu amaravathi foundation occassion, kcr amaravathi, governor narasinhan, venkaiah naidu, ap ministers, union ministers, amaravathi invitees, sai kumar, sunitha, shivamani drums, sai kumar sunitha welcome amaravati invitees, photo gallary, governers, ministers, nirmala sitaraman, gannavaram airport

The foundation stone of Amaravati, the proposed capital of Andhra Pradesh, was laid today by PM Narendra Modi

వేదమంత్రోచ్ఛరణల మద్య అమరావతికి మోడీ శంకుస్థాపన

Posted: 10/22/2015 12:46 PM IST
Pm lays foundation stone for andhra capital amaravati

నవ్యాంధ్రప్రదేశ్‌లో మరో నూతన శకం ఆరంభమైంది. చరిత్రలో మరో సవర్ణాధ్యాయానికి అంకురార్పణ జరిగింది. ఆంధ్రుల అజరామర చరిత్రకు మరో మైలురాయి తోడైంది. నవ్యాంద్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్  నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నరేంద్ర మోదీ అమరావతి అంకురార్పణకు శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సితారామన్, బండారు దత్తత్రేయ, అశోక గజపతిరాజు, సుజనా చౌదరి సహా మరికొంత మంది ప్రముఖుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
 
మధ్యాహ్నం 12.36-12.43 గంటల మధ్య మోదీ... అమరావతి శంకుస్థాపన చేశారు. ఈ ప్రధాన క్రతువు ముగిసిన అనంతరం ప్రధాని పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం అక్షింతలతో మోదీని పండితులు ఆశీర్వదించారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంతకుముందు ఉద్దండరాయునిపాలానికి చేరకున్న ప్రధాని నరేంద్రమోడీ..అమరావతి శంకుస్థాపన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రీడీ చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ చిత్రాల విశేషాలను అధికారులు మోదీకి వివరించారు. మోదీ వెంట సింగపూర్ మంత్రి ఈశ్వరన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, ఉమ్మడిరాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prime minister  narendra modi  amaravati  capital foundation stone laying cermony  

Other Articles