నవ్యాంధ్ర రాజధాని, నవశకపు రాజధాని అమరావతికి అంకురార్పణ చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధానిని పట్టు శాలువాతో సత్కరించారు. కాగా ప్రధాని నిర్ణీత సమయం కంటే పది నిమిషాలు ముందే గన్నవరం వచ్చారు.
అనంతరం ప్రధాని మోదీ గన్నవరం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో అమరావతికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అమరావతి హెలిప్యాడ్‌కు చేరుకొని.. రోడ్డుమార్గంలో రాజధాని శంకుస్థాపన వేదిక అయిన ఉద్ధండరాయుని పాలెం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.45 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ తిరుపతి వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more