పిల్లలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్న క్రమంలో వాటిని అరికట్టాలంటే.. విత్తుకొట్టడం ఒకటే మందు అని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ శిక్ష విధిస్తే మాత్రమే చిన్నారులపై అత్యాచారాలు తగ్గుతాయని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. కిరుబకరన్ వ్యాఖ్యానించారు. సంప్రదాయ చట్టాలు వీళ్లమీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, వాస్తవానికి విత్తుకొట్టడం అంటే పుంస్త్వనాశనము (మగతనం లేకుండా చేయడం) లాంటి శిక్షలు అరాచకంగా అనిపించినా.. అచారకమైన నేరాలకు తప్పనిసరిగా అరాచక శిక్షలే విధించాలని ఆయన అన్నారు.
ఈ శిక్ష అమలుపై చాలామంది అంగీకరించకపోవచ్చు గానీ, సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు ఇది మాత్రమే సరైన మందు అని ఆయన చెప్పారు. 2008 నుంచి 2014 వరకు చిన్నపిల్లలపై జరిగిన అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడినది కేవలం 2.4 శాతం మంది నేరస్థులకేనని, అయితే ఇదే సమయంలో పిల్లలపై నేరాలు 400 శాతం పెరిగాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అమెరికా సహా పలు దేశాల్లో ఇప్పటికే విత్తుకొట్టడం లాంటి శిక్షలు అమలులో ఉన్నాయని, అందుకే అక్కడ ఈ తరహా నేరాలు బాగా తగ్గాయని చెప్పారు.
తమిళనాడులో పిల్లలపై అత్యాచారం చేసిన ఓ విదేశీయుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కొట్టేసే సందర్భంగా జస్టిస్ ఎన్. కిరుబకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గత వారం ఇద్దరు చిన్నారులపై దారుణంగా జరిగిన సామూహిక అత్యాచారాల నేపథ్యంలో కోర్టు ఇంత తీవ్రంగా స్పందించింది. పిల్లలపై అత్యాచారాలు చేసిన వాళ్లకు విత్తుకొట్టే శిక్షలను ఇప్పటికే రష్యా, పోలండ్, ఈస్టోనియా, అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, తాజాగా ఆసియాలో మొట్టమొదటిగా దక్షిణ కొరియా కూడా ఈ శిక్షలను అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more