Ladies nude photos and videos in that pendrive

Ladies nude photos and videos in that pendrive

Srinivas, Kruparani, Police, Pendrive, Nude Images, Nude videos

Ladies nude photos and videos in that pendrive. Police got strong evedence, Srinivas collect nude images and videos in his pendrive. Police collecting evidence on Kruparani suicide.

అమ్మాయిల నగ్న వీడియోలు, ఫోటోలు

Posted: 10/27/2015 12:34 PM IST
Ladies nude photos and videos in that pendrive

అమ్మాయిలు.. యువతుల నగ్న ఫోటోలు, వీడియోలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. తవ్విన కొద్దీ వీడియోలు. ఫోటోలు చూసి పోలీసులు కూడా సిగ్గుతో తలదించుకున్నారు. కృపామణి కేసులో పోలీసులు విచారిస్తున్న కొలదీ వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు అందరికి విస్మయాన్ని కలిగిస్తున్నాయి. రౌడీ షీటర్ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కృపామణి ఘటనలో మరిన్ని కఠోర సత్యాలు వెలుగు చూశాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు బాసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. కృపామణిపై వేధింపులకు పాల్పడ్డ రౌడీ షీటర్ శ్రీనివాస్ ఇంటిని నిన్న పోలీసులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్ ఇంటిలో లభించిన ఓ పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని చూసి పోలీసులే నివ్వెరపోయారట. సదరు చిన్నపాటి పెన్ డ్రైవ్ లో వందలాది నగ్న వీడియోలతో పాటు న్యూడ్ ఫొటోలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయట. అంటే, ఒక్క కృపామణిపైనే కాక పెద్ద సంఖ్యలో మహిళలను శ్రీనివాస్ వేధించినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లైంది. ఇక శ్రీనివాస్ తో కృపామణి తల్లి జరిపిన సంభాషణలకు సంబంధించి ఆడియో సాక్షాలు కూడా పోలీసుల చేతికి చిక్కాయట. ఇదిలా ఉంటే ఇప్పటికీ శ్రీనివాస్ గాని, కృపామణి తల్లిదండ్రుల ఆచూకీ గాని లభ్యం కాలేదు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivas  Kruparani  Police  Pendrive  Nude Images  Nude videos  

Other Articles