Did Chhota Rajan give himself up because?

Did chhota rajan give himself up because he needed a new kidney urgently

Chhota Rajan, Bali, Mafia Don, Mumbai Mafia, Dawood, Chhota Rajan Vs Dawood

Did Chhota Rajan give himself up because he needed a new kidney urgently? While confusion prevails over the circumstances leading to Rajan’s detention in Bali on Sunday, underworld sources claimed that the ailing gangster gave himself up simply because he had run out of options for his treatment.

ఛోటా రాజన్ కిడ్నీ కోసమే లొంగిపోయాడా..?

Posted: 10/28/2015 10:03 AM IST
Did chhota rajan give himself up because he needed a new kidney urgently

మాఫియా డాన్ ఛోటా రాజన్ బాలిలో అరెస్టు కావడం సంచలనం రేపింది. భారత్ లో ఛోటా రాజన్ మీద ఎన్నో క్రిమినల్ కేసులున్నాయి. ఎంతో కాలంగా ఛోటా రాజన్ ను అరెస్టు చేసేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ భారత ప్రభుత్వం కళ్లుగప్పి..దేశదేశాలు తిరుగుతూ తన మాఫియా దందాను కొనసాగించారు ఛోటా రాజన్. అయితే బాలిలో ఛోటా రాజన్ అరెస్టు తర్వాత రకరకాల వార్తలు వస్తున్నాయి.  భారత ప్రభుత్వం అందించిన సమాచారంతోనే రాజన్ ను పట్టుకున్నారని ముందు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజాలు కాదని... అసలు రాజన్ ను ఎవరూ పట్టుకోలేదని. తనంతట తానే లొంగిపోయాడని వార్తలు వస్తున్నాయి. అయితే రాజన్ అలా లొంగిపోవడానికి కూడా కారణాలున్నాయని తెలుస్తోంది.

మాఫియా డాన్ ఛోటా రాజన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. ముఖ్యంగా కిడ్నీలు దాదాపుగా పని చెయ్యడం లేదని.. దాంతో ప్రతీసారి డయాలసిస్ చెయ్యాల్సి వస్తోందని.. కాబట్టి వెంటనే తనకు కిడ్నీ కావాలని. అందుకు లొంగిపోవడం ఒక్కటే మార్గమని ఆలోచించారట. పోలీసుల రక్షణలో తనకు సేఫ్టీ ఉంటుందని కూడా రాజన్ ఆలోచించినట్లు తెలుస్తోంది. గతంలో దావూద్ గ్యాంగ్ తన మీద హత్యాయత్నం చేసినప్పుడు ఒకటో అంతస్తు నుండి దూకి పారిపోయారు. అయితే అప్పటి నుండి రాజన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందునా తనకు ప్రాణహాని ఉందని గ్రహించి.. తనకు తానుగా లొంగిపోయాడని సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhota Rajan  Bali  Mafia Don  Mumbai Mafia  Dawood  Chhota Rajan Vs Dawood  

Other Articles