central finance ministery arun jaitley has given satirical reply to kcr for asking funds | telangana funds | central government

Arun jaitley satirical reply to kcr telangana funds central government

arun jaitley news, arun jaitley controversiers, kcr news, kcr controversy, kcr satires, arun jaitley with kcr, kcr with arun jaitley, telangana funds

Arun Jaitley satirical reply to kcr telangana funds central government : central finance ministery arun jaitley has given satirical reply to kcr for asking funds.

మాటలతో బురిడీ కొట్టించే ‘కేసీఆర్’కే ‘రివర్స్ పంచ్’

Posted: 10/28/2015 10:46 AM IST
Arun jaitley satirical reply to kcr telangana funds central government

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మైకు పట్టుకుంటే ఏ విధంగా మాట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనని తాను పొగిడే విషయం కాస్త పక్కనపెడితే.. ప్రత్యర్థి పార్టీలపై ఆయన వేసే ‘పంచ్’లకు ప్రతిఒక్కరూ ఫిదా కావాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. దేశంలోకెల్లా ‘మాటల మాంత్రికుడి’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించారు కూడా. అలాంటి ఆయనకే దిమ్మతిరిగేలా రివర్స్ పంచ్ పడింది. ఇంతవరకూ తాను ఊహించని విధంగా ఓ కేంద్రమంత్రి వేసిన ‘పంచ్’కు ఆయన కోలుకోలేకపోతున్నారని సమాచారం. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఆయన వేసిన ‘పంచ్’ ఏంటి? అనే వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే..!

గతంలో కేసీఆర్ చాలాసార్లు తెలంగాణ ‘ధనిక రాష్ట్రం’గా అభివర్ణించిన విషయం తెలిసిందే. కానీ.. రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో తన జోరు కాస్త తగ్గించిన కేసీఆర్... కేంద్రంతో ఆర్థిక సహాయం అర్థించేందుకు అక్కడ కాలుమోపగా.. ఈయనకు కోలుకోలేని షాక్ తగిలింది. ‘‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. రుణ పరిమితి పెంచండి’’ అంటూ కేసీఆర్ కేంద్రాన్ని అర్థించగా.. అందుకు ఆప్యాయంగా పలకరిస్తూనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరాచికాలు ఆడారు. ‘‘మీకేంటి కేసీఆర్ జీ!...తెలంగాణ ధనిక రాష్ట్రం కదా? అప్పు పెంచుకోవడం ఎందుకు? ఆ వెసులుబాటు ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్ బీఎం సడలింపు ఇవ్వడం సాధ్యపడదే!’’ అంటూ కేసీఆర్ ముఖం మీదే జైట్లీ చెప్పేశారు. దీంతో ఎన్నో ఆశలతో ఢిల్లీలో కాలు మోపిన కేసీఆర్ కు తొలిరోజు తొలి భేటీలోనే షాక్ తగిలినట్టింది. అయితే ఆ వెంటనే తేరుకున్న కేసీఆర్ కూడా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ.. జైట్లీ వాదనకు దీటుగానే సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో ఎన్నో వినూత్న పథకాలు చేపడుతున్నామని చెప్పిన కేసీఆర్, విదేశీ రుణం పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. బ్రిక్స్ బ్యాంకు రాష్ట్రానికి అప్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. అయినా దివాలా తీసిన రాష్ట్రాలకు అప్పు ఇచ్చేందుకు భయపడాలి కానీ, ఆర్థికంగా బలంగా ఉన్న తమ విషయంలో నిబంధనల సడలింపునకు ఇబ్బందులేమిటని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అంతేకాక ఇదే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం చెబుతోంది కదా? అని కూడా కేసీఆర్ వాదించారు. దీంతో కాస్తంత సర్దుకున్న అరుణ్ జైట్లీ వ్యయ విభాగం అధికారులతో చర్చించి తాను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  kcr  telangana funds  

Other Articles