Singer Madhupriya kidnap attempt due to love affair

Singer madhupriya kidnap attempt due to love affair

Madhupriya, Adilabad, Singer madhupriya, madupriya love marriage, madupriya loves Srikanth, Madupriya songs

Famous Singer madhupriya kidnap attempt in Adilabad. madupriya getting love marriage today. Madhupriya parents not agreed for love marriage.

సింగర్ మధుప్రియ కిడ్నాప్ కు యత్నం..!

Posted: 10/30/2015 09:03 AM IST
Singer madhupriya kidnap attempt due to love affair

‘ఆడపిల్లనమ్మా...ఆడపిల్లనాని.. బాధపడకమ్మా..’ అంటూ ఆడపిల్ల బతుకు చిత్రానికి ప్రాణం పోసిన సింగర్ మధుప్రియ కిడ్నాప్ కు తీవ్ర ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ లో ప్రస్తుతం మధుప్రియ పోలీసుల పర్యవేక్షణలో ఉంది. కాగా మధుప్రియ ప్రేమ వివాహం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో నేడు జరగనుంది. గత కొంత కాలంగా మధుప్రియ, శ్రీకాంత్ లు ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్ లో మధుప్రియ ఇంటికి దగ్గరలోనే శ్రీకాంత్ ఓ రూంలో ఉంటున్నాడని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా మధుప్రియ తన తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించారని తెలిపింది. కానీ నిజానికి వారు ఆమె ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని తెలిసింది. దాంతో మధుప్రియ రెండు రోజుల క్రితమే కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 11.20 నిమిషాలకు పెళ్లి జరిపించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్ తల్లిదండ్రులు ఈ మేరకు శుభలేఖలు కూడా పంచారు.

ప్రియుడు శ్రీకాంత్తో పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆమె ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి  కిడ్నాప్ యత్నం వరకు వెళ్లింది. ఇప్పుడే పెళ్లి వద్దంటూ తల్లిదండ్రులు వారించినప్పటికీ వారి మాటలను మధుప్రియ పట్టించుకోలేదని తెలుస్తోంది.. నిన్న అర్ధరాత్రి సమయంలో వారు కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటి వద్దకు చేరుకుని గొడవ చేయడంతో ప్రేమ జంట డీఎస్పీ బొమ్మి చక్రవర్తిని ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. పోలీసుల పర్యవేక్షణలో మధుప్రియ, శ్రీకాంత్‌ల వివాహం నేడు జరగనుంది. మధుప్రియ మైనార్టీ తీరిపోవడంతో.. పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని.. పోలీసులు వెల్లడించారు. కాగా మధుప్రియ పెళ్లికి స్థానిక టిఆర్ఎస్ నాయకులు కూడా హాజరుకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles