UP Governor Ram Naik lands in controversy over stopping national anthem mid-way

Governor stops national anthem midway

Ram Naik stops national anthem midway, Ram Naik lands in controversy, Ram Naik controversies, ram naik, national anthem, jana gana mana, up governor, up news, ram naik anthem, up governor anthem, india news

Uttar Pradesh Governor Ram Naik today stoked a controversy when he ordered stopping of national anthem mid-way as it was being played during the end of the oath taking function for ministers in Raj Bhawan.

ITEMVIDEOS: జాతీయ గీతాన్ని మద్యలో అపి వేయించిన గవర్నర్

Posted: 10/31/2015 09:04 PM IST
Governor stops national anthem midway

ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. జాతీయగీతం 'జనగనమన'ను ఆలపిస్తుండగా మధ్యలోనే ఆపేయాలంటూ ఆయన ఆదేశించారు. ఈ ఘటన ఇవాళ స్వయంగా గవర్నర్ కొలువుదీరే రాజ్ భవన్ లో చోటుచేసుకుంది. అఖిలేష్ సింగ్ ప్రభుత్వంలో కొత్తగా 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చోటుచేసుకుంది. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం.. యధావిధిగా తమకు ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు కార్యక్రమ నిర్వాహకులు.. ప్రమాణస్వీకారమహోత్సవాన్ని ముగించేందుకు జాతీయగీతాలాపన ప్రారంభించారు. అయితే, జాతీయ గీతాలాపన సాగుతుండగా మధ్యలో దానిని ఆపివేయాలని గవవర్నర్ రామ్ నాయక్ అదేశించడమే ఆయనను వివాదంలోకి లాగింది.

సర్ధార్ వల్లభాయ్ జన్మదినం సందర్భంగా జాతీయ ఐక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించాలని రామ్ నాయక్ భావించారు. జాతీయగీతం పూర్తయితే కార్యక్రమం ముగిసిపోతుందనే భావనలో... జాతీయగీతాన్ని మధ్యలోనే ఆపమని సంజ్ఞ చేయడమే కాక, నోటితో కూడా ఆదేశించారు. దీంతో, జాతీయగీతాలాపన మధ్యలోనే ఆగిపోయింది. దీంతో, ఒక్కసారిగా రామ్ నాయక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. రామ్ నాయక్ తన చర్యలతో జాతీయగీతాన్ని అవమానపరిచారని పలువురు మండిపడుతున్నారు. మరోవైపు, రామ్ నాయక్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP governor  Ram Naik  national anthem  controversy  

Other Articles