లింగ మార్పిడి.. చేసుకున్న.. చేసుకుంటున్న మనుషుల గురించి తెలుసు కానీ, ఇప్పుడీ మార్పు పశుపక్షాధులకు కూడా పాకుతుంది. అందులో ఏముంది అవి కూడా ప్రాణులే కదా అంటారా..? అంతేకాదు మహా వటవృక్షాలు కూడా లింగ మార్పిడి లోనవుతున్నాయి. లింగ మార్పడి ప్రక్రియ ద్వారా ఇప్పుడు చెట్లలో పురుషడి నుంిచ స్త్రీలుగా పరిణామాం చెందుతున్నాయి. ఈ మేరకు బ్రిటన్ వృక్ష శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా అత్యధిక వయస్సు కలిగిన ఓ మహావటవృక్షం లింగమార్పిడికి లోనవుతోంది.
దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఫార్టింగాల్ య్యూ వృక్షం.. పురుషుడి నుంచి స్త్రీగా పరిణామం చెందుతున్నది. ‘ద ఫోర్టింగల్ యూ’ మగ చెట్టును ఇలా మార్చేశామంటున్నారు బ్రిటన్ వృక్ష శాస్త్రవేత్తలు.. పెర్త్షైర్ లోని ఈ పురాతన చెట్టు పుప్పొడిని వెదజల్లేది. దీంతో దీనిని పురుష జాతి చెట్టుగా ఇన్నాళ్లు పరిశోధకులు భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవల స్త్రీ జాతి చెట్టు మాదిరిగా ఫార్టింగాల్ య్యూ కూడా విత్తనాలకు ఉపయోగపడే రెడ్ బెర్రీస్ గుత్తులను కాస్తున్నది. య్యూ చెందిన ఓ కొమ్మకు ఇటీవల మూడు రెడ్ బెర్రీస్ గుత్తులను ఎడిన్‌బరోలోని రాయల్ బొటానికల్ గార్డెన్‌కు చెందిన మాక్స్ కొలెమన్ చెప్పారు.
దీనిని బట్టి చెట్టులోని కొంతభాగం స్త్రీజాతిగా మారిందని నిర్ధారణకు వచ్చారు. ‘‘ఫోర్టింగల్ యూకు ఈ ఏడాది అక్టోబర్‌లో మూడు ఎరుపు బెర్రీలు కాయడం ఆశ్చర్యం కలిగించింది. ఇది చాలా విచిత్రం. య్యూలు, ఇతర శంఖాకార వృక్షాలు ఇలా స్వయంగా లింగమార్పిడికి లోనవ్వడంలో గతంలో ఎప్పుడూ వినలేదు' అని ఆయన వివరించారు. య్యూ చెట్టుకు వెలుపలిభాగంలో కాసిన ఒక కొమ్మ మాత్రమే ఇలా స్త్రీజాతిగా పరిణామం చెంది బెర్రీస్ ను కాస్తున్నదని ఆయన వివరించారు. ఆ ఒక్క కొమ్మ తప్ప మిగతా చెట్టంతా మగ లక్షణాలేనన్నారు. అయితే, పరిశోధనల ‘ఫలం’ దక్కుతోంది’ అపి కోలలెమన్ అన్నారు. కాగా ఈ పరిణామాన్ని చూసిన అక్కడి భారతీయులు మాత్రం వటవృక్షం అర్థనారీశ్వరుడిగా పరిణామం చెందిందని అంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more