భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు పాకిస్థాన్ నుంచి పిలుపు వచ్చింది. భారత్ లో నివసించేందుకు ఇబ్బందిగా వుంటే.. పాకిస్తాన్ కు వచ్చి స్వచ్ఛందంగా నివాసం ఏర్పరుచుకుని హాయిగా జీవింవచ్చునని ఆయనకు పాక్ పిలుపునిచ్చింది. అయితే.. షారుఖ్ ని ఇలా ఆహ్వానించింది అక్కడి ప్రభుత్వమో లేక ఏ రాజకీయ నాయకులో కాదు.. కరుడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది, ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్. ఆ ఉగ్రవాది షారుఖ్ ని ఇలా పిలవడానికి గల కారణం ఏమిటంటే.. దేశంలోని పలు రాజకీయ నాయకులు షారుఖ్ పై తీవ్ర విమర్శలు చేయడమే.
పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ ఖాన్.. దేశంలో జరుగుతున్న హింసపై, అందుకు నిరసనగా కళాకారులు తమ అవార్డులు తిరిగి వెనక్కి ఇవ్వడంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. తాను కూడా అందరిలాగే తన అవార్డులను తిరిగి ఇచ్చేయగలనని, కానీ అలా చేయడం ఇష్టం లేదని తెలిపాడు. దేశంలో భావప్రకటన స్వేచ్ఛ మీద మాట్లాడగలనని.. కానీ అలా మాట్లాడితే తన ఇంటి మీద రాళ్ల దాడి జరుగుతుందని కూడా అన్నాడు. దేశంలో తలెత్తుతున్న హింస తనకు కూడా అసహనం కలిగించిందని పేర్కొన్నాడు. ఈ విధంగా షారుఖ్ వెల్లడించిన అభిప్రాయాలపై కొందరు రాజకీయ ప్రముఖులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా.. సాధ్వి ప్రాచి ఆయనపై విరుచుకుపడుతూ.. షారుఖ్ పాకిస్థాన్ ఏజెంట్లా మాట్లాడుతున్నారని మండిపడింది. ‘షారుఖ్ పాకిస్థాన్ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు.. దేశంలో జరుగుతున్న హింస గురించి ఆయనకేం తెలుసు..? అతడిని వెంటనే పాక్ కు పంపించాల’ని ఆమె వ్యాఖ్యానించారు. మరికొందరు షారుఖ్ కు ‘దేశద్రోహి’గా అభివర్ణించారు కూడా. దీంతో మండిపడ్డ పాక్ ఉగ్రవాది.. షారుఖ్ కు మద్దతుగా నిలిచి, పాక్ కు రావాల్సిందిగా పిలుపునిచ్చాడు.
‘క్రీడలు, కళలు, విద్య తదితరాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న భారత ముస్లింలు.. భారత్ లో తమ గుర్తింపు కోసం నిత్యం యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షారూక్ సహా ఎవరైనా ముస్లిం, ఇస్లాం కారణంగా ఇండియాలో కష్టంగా ఉందని భావిస్తే, వారు పాకిస్థాన్ కు వచ్చి నివాసం ఏర్పరచుకోవడానికి స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ పెట్టాడు. మరి.. ఈ ఉగ్రవాది ట్వీట్ పై షారుఖ్ ఎలా స్పందిస్తాడో, రాజకీయ నేతలు ఏ విధంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారోనని ఆసక్తికరంగా మారింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more