bjp has released new advertisement on cow during bihar elections which goes viral indiawide | arvind kejriwal | lalu prasad yadav

Bjp cow advertisement become controversy in bihar elections

bjp cow ad, nitish kumar, lalu prasad yadav, arvind kejriwal, cow controversy in india, cow meet controversy, bihar elections controversies

bjp cow advertisement become controversy in bihar elections : bjp has released new advertisement on cow during bihar elections which goes viral indiawide

సంచలనంగా మారిన బీజేపీ ‘ఆవు’ ప్రకటన

Posted: 11/04/2015 01:55 PM IST
Bjp cow advertisement become controversy in bihar elections

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నో వివాదాస్పద ఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా బీజేపీ విడుదల చేసిన ‘ఆవు’ ప్రకటన మరో సంచలనానికి దారి తీసింది. 'ముఖ్యమంత్రి(బీహార్ సీఎం నితీష్ కుమార్) గారు.. మీ భాగస్వమి (లాలూ ప్రసాద్ యాదవ్) పవిత్ర గోమాతనూ, హిందువులనూ అవమానిస్తూ స్టేట్మెంట్లు గుప్పిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి మీరు మౌనంగా వుంటున్నారు. దీని అంతరార్థమేమిటి?’ అంటూ బీజేపీ ఓ ప్రకటనను జారీ చేసింది.

కొద్దిరోజుల కిందట దాద్రీ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. హిందువులు కూడా గోమాంసం తింటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై నితిశ్ కుమార్ మౌనం వహించడమూ విదితమే. దీన్ని అస్త్రంగా మలుచుకుని మహాకూటమిపై ఎన్నో విమర్శలు గుప్పించిన బీజేపీ.. ఇప్పుడు ఆ అంశాన్నే ‘ప్రకటన’ రూపంలో విడుదల చేసి దుమారం రేపింది. ఈ ప్రకటన బుధవారం బిహార్లోని అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రధానంగా 9 జిల్లాల్లో రాజకీయ కలకలం రేగింది. ఎందుకంటే.. ఈ జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లోనే గురువారం ఐదో(చివరి) విడత పోలింగ్ జరగనుంది. వీటిలో ఎక్కువ స్థానాల్లో ముస్లిం ఓటర్లదే ఆధిపత్యం. ఎంఐఎం పార్టీ కూడా ఈ ప్రాంతం నుంచి పోటీచేస్తుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇలా హిందూత్వ కార్డును ప్రయోగించడంపై మిగిలిన పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిహార్ వెలుపలి నేతలు కూడా స్పందించారు.

'ప్రకటనలో కేవలం బీజేపీ అని మాత్రమే పేర్కొన్నారు. ఇంతకీ ఈ యాడ్ ఇచ్చింది ఆ పార్టీ అనుచరగణమా? లేక అధిష్ఠానమా?' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. 'ఉద్రేకపూరిత ప్రకటనతో నిద్రలేచినట్లు బీహార్ కామ్రేడ్లు ఫోన్లు చేశారు' అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ ట్వీట్ చేశాడు. ఇక జేడీయూ- ఆర్జేడీల మహాకూటమి నేతలు బీజేపీ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రకటన బీజేపీకి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన మరెన్ని వివాదాలకు దారితీస్తుందో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp cow ad  cow meat controversy  bihar elections  

Other Articles