big fight has been occured between sarika and rajaiah family over emails to aicc before she died | sarika died with three children

Big fight between sarika and rajaiah family over emails to aicc

sarika death news, rajaiah daughter in law death news, rajaiah fight with sarika, rajaiah family fought with sarika, sarika emails controversy, sarika updates, sarika died with children

big fight between sarika and rajaiah family over emails to aicc : a big fight has been occured between sarika and rajaiah family over emails to aicc before she died.

రాజయ్య కోడలి ‘ఈ-మెయిల్స్’ గొడవ..

Posted: 11/05/2015 10:41 AM IST
Big fight between sarika and rajaiah family over emails to aicc

మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన కోడలు, ముగ్గురు మనవళ్లు మరణించగా.. ఈ ఘటనపై ఎన్నోరకాల అనుమానాలు, కొత్తకొత్త అంశాలు తెరమీదకి వస్తున్నాయి. ఈ దారుణం చోటు చేసుకోవడానికి ముందురోజు అంటే మంగళవారం రాత్రి రాజయ్య ఇంట్లో పెద్దఎత్తున గొడవ జరిగిందని తెలుస్తోంది. దీనికి కారణం.. సారిక చనిపోవడానికి మూడురోజుల క్రితం ‘తనను, తన పిల్లల్ని పట్టించుకోని మామకు వరంగల్ ఉపఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వొద్దంటూ’ ఏఐసీసీ పెద్దలకు పంపిన ఈ-మెయిళ్ళేనని విశ్వసనీయ సమాచారం.

వరంగల్ ఉపఎన్నికల్లో భాగంగా మంగళవారం ప్రచారంలో బిజీబిజీగా వున్న రాజయ్య.. పొద్దుపోయాక ఇంటికి వచ్చారు. అయితే.. ఆయన ఇంటికి రాకముందే సారిక ఏఐసీసీ పెద్దలకు పెట్టిన ‘ఈ-మెయిల్స్’పై ఆమె భర్త, అత్త మాధవిల మధ్య పెద్దఎత్తున గొడవ జరిగిందట. ‘పార్టీ టికెట్ కోసం ఒంటరిగా బరిలోకి దిగి ఎలాగోలా టికెట్ సాధించుకుంటే.. అసలే టికెట్టే ఇవ్వొద్దంటూ ఏఐసీసీ పెద్దలకు మెయిల్స్ ఎందుకు పెట్టావని, ఇంటినుంచే వ్యతిరేకత ఎదురైతే ఎలాగంటూ సారికపై అనిల్ విరుచుకుపడినట్లు సమాచారం. అయితే.. తనను, పిల్లల్ని పట్టించుకునే విషయంలో ఈ తరహా ఆసక్తి చూపితే అసలు గోడవే వుండదు కదా? అని సారిక వారితో వాదనకు దిగినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇంతలోనే రాజయ్య కూడా ఇంటికి చేరుకోవడంతో ఈ గొడవ మరింత పెద్దదిగా మారిందని తెలుస్తోంది. ఈ సందర్భంగానే.. తనతో ఇలాగే గొడవపడితే మరోమారు మీడియా ముందుకు వెళ్లాల్సి వస్తుందని సారిక వారికి తేల్చిచెప్పిందని సమాచారం. దీంతో కాస్త బెంబేలెత్తిన రాజయ్య.. గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారట. అనంతరం రాజయ్య, ఆయన భార్య మాధవి తమ గదిలోకి వెళ్లిపోగా, అనిల్ మరో గదిలో వెళ్లిపోయాడు. ఇక సారిక కూడా తన పిల్లల్ని తీసుకుని నిద్రకు ఉపక్రమించింది.

కానీ.. తెల్లారేసరికి ఎవరూ ఊహించని భారీ ప్రమాదం జరిగిపోయింది. మంగళవారం రాత్రి అత్తామామలతో గొడవకు దిగిన సారిక.. తెల్లవారుజామున చోటు చేసుకున్న గటనలో తన ముగ్గురు పిల్లలతో సహా మంటలకు ఆహుతి అయ్యింది. ఇదిలావుండగా.. తమ కూతుర్ని రాజయ్య కుటుంబసభ్యులే కుట్రపన్ని చంపేశారంటూ సారిక తలిదండ్రులు ఆరోపించిన నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarika died with three children  rajaiah daughter in law  

Other Articles