Baba Ramdev attacks Shahrukh Khan

Baba ramdev attacks shahrukh khan

Ramdevbaba, India, Sharukh Khan, Padma sri, Awards, intolerance, Modi, Award wapasi

Yoga guru Baba Ramdev lashed out against Bollywood superstar Shahrukh Khan for his recent remark on the "growing religious intolerance" in the country, and said whatever the actor said is mere rhetoric.

షారుఖ్ అది ఇచ్చెయ్ అంటున్న రాందేవ్ బాబా

Posted: 11/05/2015 10:49 AM IST
Baba ramdev attacks shahrukh khan

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మీద విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దేశంలో అసహనం పెరిగిందని, కళాకారులు, మత అసహనం దేశానికి హానికరం అంటూ షారుఖ్ ఖాన్ తన పుట్టిన రోజు నాడు వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అయితే తాజాగా షారుఖ్ ఖాన్ మీద మధ్యప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే తీవ్రంగా వ్యాఖ్యానించడంతో దుమారం మరింత రేగింది. పాకిస్థాన్ మీదే మొత్తం ధ్యాస ఉందని ఆయన అన్నారు. యోగిరాదిత్య కూడా హఫీజ్ సయిద్ కు షారుఖ్ ఖాన్ మాటలకు పెద్దగా తేడా లేదని అన్నారు. అయితే తాజాగా మరో వ్యక్తి షారుఖ్ ఖాన్ ను ప్రశ్నించారు. షారుఖ్ ఖాన్ దేశంలో అసహనం మీద మాట్లాడే ముందు ఒక పని చెయ్యాలని అంటున్నారు.

షారుఖ్ ఖాన్ తన పుట్టిన రోజు నాడు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న అసహనం మీద స్పందించారు. మతహింసకు వ్యతిరేకంగా చాలా మంది తమకు కేంద్రం ఇచ్చిన అవార్డులను వెనక్కి తిరిగి ఇవ్వడానికి ముందుకు వచ్చారు.. అయితే వారి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని.. తనకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ అవార్డులు రాలేదని లేదంటే తాను కూడా వెనక్కి ఇచ్చే వాడినని అన్నారు. అయితే రాందేవ్ బాబా దీన్ని తప్పు పట్టారు. ముందు తనకిచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇవ్వాలని.. పురస్కారంతో వచ్చిన నగదును కూడా ప్రధాన మంత్రి సహాయ నిధికి బదిలీ చెయ్యాలని రాందేవ్ పిలుపునిచ్చారు. మరి చూడాలి.. షారుఖ్ తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తారా లేదా.?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramdevbaba  India  Sharukh Khan  Padma sri  Awards  intolerance  Modi  Award wapasi  

Other Articles