How muslims vote in burkas

How muslims vote in burkas

Muslims, Burkas, Bihar, Elections, Polls, Muslim lady, ashwin kumar

Muslim ladies voting waring burkas in all elections. Bihar MP Ashwin kumar objection this. he said that muslims must show thier faces while polling

బురఖాల్లో ఓట్లేస్తే ఎలా...? ఓ ఎంపీ ప్రశ్న

Posted: 11/05/2015 11:28 AM IST
How muslims vote in burkas

దొంగ ఓట్లు వేసే వాళ్లను కట్టడి చెయ్యడానికి ప్రభుత్వం ఓటరు గుర్తింపు కార్డులను ఇచ్చింది. కానీ ఓటరు గుర్తింపు కార్డులున్నా కానీ దొంగ ఓట్లు వేసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే ముఖాలు కనిపించకుండా వేసుకువచ్చే ముసుగులు ముఖ్యంగా బురఖాల వల్ల చాలా ఓట్లు దొంగతనంగా నమోదవుతున్నాయని అంటున్నారు. బురఖాలో వేసుకున్న ముస్లింలు తమ ముఖాన్ని ఓటింగ్ సమయంలో కనిపించకుండా దాచుకుంటారని.. అలా చేస్తే ఒటింగ్ ఎవరు వేస్తున్నది ఎవరో ఎలా తెలుస్తుందని అంటున్నారు. అయితే ఇది కూడా పాయింటే.. నిజానికి చాలా మంది ముస్లిం యువతులు బురఖాలో హాజరవుతున్నారని.. దాని వల్ల ఓటింగ్ లో గందరగోళంగా తయారైందని అంటున్నారు.

ఓటు హక్కు వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకోవాలి అని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అయితే పోలింగ్ లో మాత్రం జరిగే అవకతవకలను మాత్రం ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి. అయితే అంతకంటే ముందు ముస్లిం యువతులు వేసుకువచ్చే బురఖాను ఓటింగ్ టైంలో తీయాలని చెప్పాలంటూ బీహార్ ఎంపీ అశ్విన్ కుమార్ చౌబె అన్నారు. వాళ్లు వేసుకునే ముసుగు వల్ల ఓటింగ్ లో అవకతవకలు తలెత్తుతున్నాయని అన్నారు. ముస్లిం యువతులు ఓటింగ్ టైంలో తమ ముసుగులు తీసి.. ఓటర్ కార్డులు చూపించి.. ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muslims  Burkas  Bihar  Elections  Polls  Muslim lady  ashwin kumar  

Other Articles