America tennis star Serena Williams chases a robber after phone grabbed in chinese restaurant | America tennis star serene williams

Serena williams chases robber after phone grabbed in chinese restaurant

Serena Williams news, Serena Williams chase robber, Serena Williams chase mobile robber, Serena Williams a man who grabbed her phone, america tennis star news, america tennis star controversy, Serena Williams

Serena Williams chases robber after phone grabbed in chinese restaurant : America tennis star Serena Williams chases a robber after phone grabbed in chinese restaurant.

సెల్ ఫోన్ దొంగకు చుక్కలు చూపించిన టెన్నిస్ స్టార్

Posted: 11/05/2015 11:28 AM IST
Serena williams chases robber after phone grabbed in chinese restaurant

తన మొబైల్ ఫోన్ ను దొంగలించిన ఓ దొంగకు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ చుక్కలు చూపించింది. సింపుల్ గా మొబైల్ దొంగతనం చేసి అక్కడి పరారయ్యానని సంబరపడ్డ ఆ దొంగకు సెరెనా సెకన్ల వ్యవధిలోనే అతని ముందు ప్రత్యక్షమై షాక్ కి గురిచేసింది. ఆమెను బెంబేలెత్తిన దొంగ.. సెల్ ఫోన్ ని ఆమె చేతిలో పెట్టేసి అక్కడి నుంచి తుర్రుమన్నాడు.

తన సోదరి వీనస్ విలియమ్స్, మరో టెన్నిస్ స్టార్ కరోలినా వోజ్నియాకిలతో కలిసి సెరెనా నిన్న (బుధవారం) ఓ చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లింది. బిజీగా ఉండే ఆ రెస్టారెంట్ లో ఓ టేబుల్ ముందు కూర్చున్న సెరెనా, తన మొబైల్ ఫోన్ ను మరో కుర్చీలో పెట్టింది. దీనిని గమనించిన ఓ దొంగ చిన్నగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డట్టే నిలబడి, ఉన్నట్టుండి సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. అయితే సెకన్ల వ్యవధిలో రియాక్ట్ అయిన సెరెనా, కుర్చీలో నుంచి శివంగిలా దూకింది. కళ్లు మూసి తెరిచేలోగా దొంగ ముందు నిలబడింది. ఊహించని విధంగా తన ముందు నిలబడ్డ సెరెనాను చూసి షాక్ తిన్న సదరు దొంగ సెల్ ఫోన్ ను తిరిగిచ్చేసి తుర్రుమన్నాడు.

సెల్ ఫోన్ ను దొంగ నుంచి తీసుకుని తిరిగి రెస్టారెంట్ కు వచ్చిన సెరెనాకు అక్కడ కూర్చున్న వారంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ ఘటనను కళ్లకు కట్టేలా రాసిన సెరెనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ‘ఇన్ స్టాగ్రాం’, ‘ఫేస్ బుక్’లలో పోస్ట్ చేసింది. ఏదేమైనా.. ఈ ఇన్సిడెంట్ తో సెరెనా మైదానంలో ప్రేక్షకులతో హోరెత్తించడమే కాకుండా పరుగులోనూ సూపర్ స్టారేనని నిరూపించుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Serena Williams  mobile theft  

Other Articles