police officers siezed rajaiah food | former mp rajaiah daughter in law death case mystery | sarika death mystery

Former mp rajaiah daughter in law death case mystery police investigation on food

sarika death mystery, rajaiah home blast, former mp rajaiah daughter in law death, sarika died with children, sarika controversies, rajaiah controversies

former mp rajaiah daughter in law death case mystery police investigation on food : police officers siezed rajaiah food and improved investigation in sarika children death mystery.

సారిక మృతికేసులో వెలుగుచూసిన మరో ‘ట్విస్ట్’

Posted: 11/05/2015 12:36 PM IST
Former mp rajaiah daughter in law death case mystery police investigation on food

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన కోడలి, ముగ్గురు మనవళ్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎన్నో అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటనలో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. గదిలో వున్న సిలిండర్ల నుంచి గ్యాస్ లీకేజ్ అవుతున్నా.. ఆ వాసనను సారిక, పిల్లలు ఎందుకు పసిగట్టలేకపోయారన్నది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. రాజయ్య నివాసంలో ఆహార పదర్థాలను సీజ్ చేశారు. సారిక, పిల్లలు తిన్న అన్నంలో మత్తమంతు కలిపారనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్‌రూమ్‌కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన సారిక తన పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్‌రూమ్‌కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు ఎదుకు పేలలేదన్న విషయంపై ఆరాతీయగా.. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారు తిన్న ఆహారంలో ఎవరైనా మత్తుమందు కలిపారా? అందుకే.. గ్యాస్ లీక్ అయినా ఆ వాసనను కూడా గుర్తించలేకపోయారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు వారు తిన్న ఆహారాన్ని సేకరించి... పరీక్షలకు పంపారు.

ఇక మాజీ ఎంపీ రాజయ్యతోపాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్.. మామూనూరు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ నిమిత్తం హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి మామూనూరుకు తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రెండో వివాహం చేసుకున్న సనా అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarika death mystery  rajaiah controversies  

Other Articles