Pritika yasni is first transgender to become si in tamilnadu state police department | first hijra si | first trangeder si

Pritika yasni is first transgender to become si in police department

pritika yasni, first hijra si, first trangender si, pritika yasni si post, pritika yasni got si post, dilip turned as hijra got si post, madras high court, third category people

Pritika yasni is first transgender to become si in police department : Pritika yasni is first transgender to become si in tamilnadu state police department.

ఎస్సైగా బాధ్యతలు చేపట్టనున్న ‘హిజ్రా’

Posted: 11/06/2015 10:43 AM IST
Pritika yasni is first transgender to become si in police department

సమాజంలో తమకు ఏమాత్రం మర్యాదలేంటూ భోరమంటున్న హిజ్రాలకు ఆదర్శంగా నిలబోతోంది ఓ హిజ్రా. తామూ తలచుకుంటే ఏమైనా సాధించగలమని ఆమె నిరూపించింది. తమలోనూ ప్రతిభ దాగివుందని తన సత్తా చాటుతోంది. విద్యలో ఉత్తీర్ణతో సాధించిన ఆ హిజ్రా.. ఇప్పుడు పోలీసు శాఖలో త్వరలో సబ్-ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతోంది. ఆమె పేరే ప్రితికా యాస్ని. తొలుత ఎస్సై పరీక్షలు ఈమెను అనుమతించేందుకు అధికారులు నిరాకరించగా.. దాన్ని సవాలుగా తీసుకుని ఏకంగా హైకోర్టు సహకారం తీసుకుని తన ప్రతిభ చాటింది.

ఇటీవల తమిళనాడు రాష్ట్ర పోలీసు యూనిఫాం రిక్రూట్ మెంట్ బోర్డు నేతత్వంలో ఎస్సైకు సంబంధించిన రాత పరీక్షలు జరిగాయి. ఇందుకు హిజ్రా ప్రితికా యాస్ని దరఖాస్తు చేసుకుంది. అందులో మూడో కేటగిరికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో ఆమె స్త్రీగా పేర్కొన్న ప్రదేశంలో  టిక్ చేసింది. అయితే.. పరిశీలనలో ప్రితికా హిజ్రాగా తేలింది. దీంతో ఆమెను  పరీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారు. దీన్ని సవాలుగా తీసుకున్న ప్రితికా.. కోర్టును ఆశ్రయించి మరీ పరీక్ష రాసింది. అలాగే.. ఫిజికల్ తదితర అన్నిరకాల  టెస్టుల్లోనూ రాణించింది. సబ్ ఇన్‌స్పెక్టరు అయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు సాధించింది. అయితే.. ఆమెకు పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. హిజ్రా అన్న ఒక్క కారణంతో ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో కాస్త నిరాశకు గురైన ప్రితికా.. ఎలాగైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే నిర్ణయంతో మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది. తనకు పోస్టింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ హైకోర్టును ఆశ్రయించింది.

ఆమె పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, పుష్పా సత్యనారాయణన్ నేతత్వంలోని ప్రధాన బెంచ్ పరిగణలోకి తీసుకుని, విచారణ చేపట్టింది. విచారణ అనంతరం గురువారం రాష్ట్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. హిజ్రాలకే ప్రితికా యాస్ని ఆదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొంటూ, రాత పరీక్షల్లో, ఫిజికల్ తదితర  టెస్ట్‌ల్లో అర్హత సాధించిన ప్రితికా యాస్నికి సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు సంబంధించిన నియామక ఉత్తుర్వులను త్వరితగతిన జారీ చేయాలని ఆదేశించారు. అలాగే.. మూడో కేటగిరిలో ఉన్న హిజ్రాలకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డులో ఉద్యోగాల కల్పనకు సంబంధించి విధి విధానాలను త్వరితగతిన రూపొందించి, అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ ఆదేశంతో త్వరలో రాష్ట్ర పోలీసు శాఖలో ప్రితికా యాస్ని సబ్ ఇన్‌స్పెక్టర్ బాధ్యతలు చేపట్టిన తొలి హిజ్రా జాబితాలోకి ఎక్కబోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pritika yasni  first transgender si india  third category people  

Other Articles