Modi mother gave five thousand rupees to Him

Modi mother gave five thousand rupees to him

Modi, Modi Mother, jammu Kashmir, Modi on kashmir, Modi on jammu, Srinagar, Modi about his mother

Narendra Modi mother gave five thousand rupees on his birth day. On Srinagar rally modi spoke heart touching sentences.

మోదీకి 5వేలు ఇచ్చిన వాళ్లమ్మ

Posted: 11/07/2015 04:31 PM IST
Modi mother gave five thousand rupees to him

ప్రధాని నరేంద్ర మోదీ సభల్లో మాట్లాడే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. గుండె లోతులకు హత్తుకునేలా సెంటిమెంటల్ గా మాట్లాడటం మోదీకి వచ్చినట్లు ఎవరికీ రాదు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. ఎన్టీఆర్ పేరు ఎత్తడంలాంటి సెంటిమెంట్ లను బాగా ఫాలోఅవుతారు. అయితే తాజాగా శ్రీనగర్ లో జరిగిన సభలో కూడా ఇలాంటి సెంటిమెంటల్ స్టోరీ ఒకటి చెప్పి అందరిని మెస్మరైజ్ చేశారు. అది కూడా తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనను వివరించారు. తన తల్లికి, తనకు మధ్యన జరిగిన యదార్థగాధను వివరించారు.

శ్రీనగర్ లో మోదీ జమ్ము కాశ్మీర్ ప్రజలకు కేంద్రం ప్రభుత్వ తరఫున 80చ వేల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీరీలకు తన మాటలతో మత్తెక్కించారు మోదీ. ప్రతి పుట్టిన రోజు నాడు మోదీ తల్లి ఐదు రూపాయలు ఇచ్చేదని.. కానీ జమ్ము కాశ్మీర్ లో వరదల భీభత్సాన్ని చూసిన తర్వాత మాత్రం కష్టపడి ఐదు వేల రూపాయలు ఇచ్చిందని.. ఆ డబ్బులను వరద బాధితులను ఆదుకునేందుకు వాడాలని వివరించారు. అక్కడున్న వారంతా మోదీ మాటలకు చెప్పట్లతో అభినందించారు. మొత్తానికి మోదీ సందర్భానుసారంగా మాట్లాడటంలో దిట్ట అని మరోసారి నిరూపించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Modi Mother  jammu Kashmir  Modi on kashmir  Modi on jammu  Srinagar  Modi about his mother  

Other Articles