దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని చేజింక్కించుకుని ముందుకు సాగుతున్న క్రమంలో నిత్యం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష జోక్యంలో ఇబ్బందులను ఎదుర్కోంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతునే వున్నారు. ఈ క్రమంలో వెల్లడైన బీహార్ ఫలితాల నేపథ్యంలో ఆయన మరోమారు మోడీ సర్కార్ పై కేజ్రీవాల్ ఘాటుగా వ్యాఖ్యాలు చేశారు. బీహార్ ఎన్నికలు బీజేపి కళ్లు తెరిపించాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి రావడంతో వాళ్లకు ఆరేడేళ్ల తర్వాత గర్వం వచ్చిందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఏడాదిలోపే గర్వం వచ్చేసిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. బిహార్ ఫలితాలతో ప్రజలు ఆ గర్వాన్ని బద్దలు కొట్టారన్నారు. ఈ ఫలితాల పుణ్యమాని కేంద్రంలో వాళ్ల మంత్రులకు పనిచేసే స్వతంత్రం వస్తుందని, బీజేపీలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు గౌరవం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలనలో వేలు పెడుతున్న తీరు ఇకపై ఆగుతుందని భావిస్తున్నామని చెప్పారు.
వాళ్లు పదే పదే.. ప్రతిరోజూ తమ పనిలో వేలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం జోక్యం తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు. అసహన వాతావరణం ఇప్పటికైనా ఆగుతుందని, జాతుల మధ్య, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. బిహార్ ఫలితాలు ఒక రకంగా ప్రధాని నరేంద్రమోదీ పనితీరు మీద రిఫరెండం లాంటివని అన్నారు. ఆయనెలా పనిచేస్తున్నారో, అమిత్ షా - మోదీ జోడీ ఎలా ఉందో యావత్ దేశానికి తెలిసిపోయిందని విమర్శించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more