Alu in samosa and lalu in bihar

Alu in samosa and lalu in bihar

Alu, Lalu, Bihar, Elections, Nitesh Mukar, RJD, Bihar elections 2015, Lalu Prasad victory in Bihar

The spectacular victory of the grand alliance on Sunday has put RJD chief Lalu Prasad in firm control of the party and also extended his family’s footprint on the political space with the debut of his two sons in the assembly.

సమోసాలో ఆలు.. బీహార్ లో లాలూ

Posted: 11/09/2015 10:43 AM IST
Alu in samosa and lalu in bihar

జబ్ తక్ సమోసా మే.. ఆలు రహేగా.. తబ్ తక్ బీహార్ మే లాలూ (ఎప్పటి దాకా సమోసాలో ఆలు ఉంటుందో.. అప్పటి దాకా బీహార్ లో లాలూ ఉంటాడు) అంటూ ఎప్పుడూ చమత్కరించే లాలూ ప్రసాద్ ఈ ఎన్నికల్లో తన టాలెంట్ ను చూపించారు. బీహార్ బరిలో నితీష్ కుమార్ తో సీట్లను పంచుకున్న లాలూ.. పార్టీని బలోపేతం చెయ్యడంలో చాలా కీలకంగా వ్యవహరించారు. దాదాపు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న లాలూ చాలా కాలం తర్వాత తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చి.. పార్టీకి కొత్త ఊపుతీసుకువచ్చారు. గతంలో పార్టీని ముందుకు తీసుకురావడంలో విఫలమైన లాలూ ప్రసాద్ ఈసారి మాత్రం అందులో పూర్తిగా పై చేయి సాధించారు.

బీహార్ ఎలక్షన్ లో లాలూ ప్రసాద్ అందరి కంటే ఎక్కువ సీట్లను సాధించి మహా కూటమిలో అతి పెద్ద పార్టీగా ఎదిగారు. కానీ తమ సిఎం మాత్రం నితీష్ కుమారే అని ముందు నుండి లాలూ చెబుతూనే ఉన్నారు. నితీష్ తో కలిసి రావడంతో లాలూకు ఎక్కువ లాభం చేకూరందని చెప్పాలి. గతంలో కేవలం 22 సీట్లు సాధించిన ఆర్జేడీ ఈసారి ఎన్నికల్లో మాత్రం 88 సీట్లు సాధించి 58 సీట్ల పెరుగుదలను నమోదు చేసుకున్నారు. ఆర్జేడీ అంటేనే కుటుంబ పార్టీ అని అందరికి తెలుసు. లాలూ భార్య, కొడుకులు, కూతురు ఇలా అందరూ కూడా పార్టీని నడిపిస్తున్నారు. అయితే మహాకూటమిలో భాగంగా నితీష్ కుమార్ సిఎంగా ఎదిగినా కానీ.. లాలూనే మొత్తం చక్కబెడతారు అన్నది అందరి నోట్లో నానుతున్న వార్త. బీహార్ లో కీ రోల్ గా మారిన ఆర్జేడీ ముందు ముందు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alu  Lalu  Bihar  Elections  Nitesh Mukar  RJD  Bihar elections 2015  Lalu Prasad victory in Bihar  

Other Articles