బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీహారీలు మరోసారి నితీష్ కుమార్ కు పట్టంకడుతూ.. తమ తీర్పును ఓటు ద్వారా వెల్లడించారు. కానీ నితీష్ కుమార్ బీహార్ లో ప్రభవించడానికి అసలు కారణం చాలా మందే ఉన్నారు. అయితే అందులో ఓ వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అతనే ప్రశాంత్ కిషోర్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారరథాన్ని ముందుకునడిపిన ప్రశాంత్ కిషోర్ ఈసారి నితీశ్‌కుమార్ వెన్నంటి ఉండి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. తెర వెనుక ఉండి ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన ఆయన గత మే నెలలోనే రంగంలోకి దిగి.. మరోసారి నితీశ్‌కు సీఎం పీఠం దక్కేలా వ్యూహాలు సిద్ధం చేశారు.
నిజానికి ప్రశాంత్ కిషోర్ పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్. నరేంద్రమోదీ కోసం ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి తరఫున చేస్తున్న ఉద్యోగానికి 2011లో రాజీనామా చేసి భారత్ తిరిగొచ్చారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు మోదీ ప్రభుత్వాన్ని మారుపేరుగా జాతీయవ్యాప్తంగా ప్రచారం చేయడంలో కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వినూత్న రీతిలో సాగించిన ప్రచారానికి రూపకల్పన చేసింది కిషోరే. ముఖ్యంగా ఆయన రచించిన 'చాయ్ పే చర్చ' మోదీకి ప్రచారంలో బాగా కలిసివచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచార వ్యూహాలకు పదునుపెట్టే ప్రశాంత్ కిషోర్ బృందంలో ప్రధానంగా యువ ఎంబీఏ, ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఉంటారు.
ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించడం, విజయం ఖాయమన్న సందోహాన్ని కల్పించడం కిషోర్ ప్రచార వ్యూహాల్లో ప్రధానంగా ఉంటాయి. మోదీకి 'చాయ్ పే చర్చ' కార్యక్రమాన్ని రూపొందించిన ఆయన నితీశ్ కోసం 'పర్చా పే చర్చ'ను తెరముందుకు తెచ్చారు. గత పదేళ్లలో నితీశ్ సర్కార్ పనితీరుపై తమ అభిప్రాయాన్ని తెలుపాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా కోరారు. ఎల్ఈడీ మానిటర్లతోపాటు 400 ట్రక్కుల పాంఫ్లెట్లను ఇందుకోసం బిహార్‌లోని అన్ని గ్రామాలకూ పంపారు. ఆయన రూపొందించిన కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంలో నితీశ్ నేతృత్వంలోని మహాకూటమికి బాగా కలిసివచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more