last time NTR in AP now Nitesh in Bihar

Last time ntr in ap now nitesh in bihar

NTR, Prannoy Roy, Bihar, Elections, Nitesh Kumar, Bihar results, NTR in AP

Prannoy Roy Apologise for Bihar Results Confusion. The last time we made an error as big as this was about 32 years ago when NT Rama Rao won with a landslide. Since then we've never made such a big - we've made errors - but not as big as this one.

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు నితీష్ విషయంలో

Posted: 11/09/2015 11:46 AM IST
Last time ntr in ap now nitesh in bihar

తెలుగు నాట రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించిన స్వర్గీయ ఎన్టీఆర్ విషయంలో ఓ తప్పుడు లెక్క వచ్చింది. అదే మాదిరిగా ఇప్పుడు నితీష్ కుమార్ విషయంలో కూడా లెక్క తప్పింది. తప్పుడు అంచనాలు వేసి.. అందరికి క్షమాపణ చెప్పింది ఎన్డీటీవీ. తాజాగా వెల్లడించిన బీహార్ ఫలితాల మీద తమ అంచనాలు పూర్తిగా విఫలమైనందున వీక్షకులకు క్షమాపణలు చెప్పారు ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుడు ప్రణోయ్ రాయ్. 32 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నాటి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయాన్ని అంచనా వెయ్యలేకపోయిన ఎన్డీటీవీ బీహార్ ఎన్నికల సమయంలో కూడా అదే తప్పును రిపీట్ చేసింది.

32 ఏళ్ల క్రితం తెలుగు నాట తెలుగు వాడి ఆత్మగౌరవం పేరుతో.. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలా స్థాపించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఎన్టీఆర్ వంద శాతం విజయం సాధించారు. దాంతో ఏపిలో తిరుగులేని మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. కానీ ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం దీన్ని వ్యతిరే్కించాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్టీఆర్ కు ఊహించనంత విజయం సొంతం కాదు అని తేలింది. కానీ ఫలితాలు మాత్రం ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పలికాయి. తాజాగా బీహార్ లోనూ అదే సీన్ కనిపించింది. ఎన్డీయే పక్షం బీహార్ లో గద్దెనెక్కే అవకాశం ఉందని ఎన్డీటీవీ వెల్లడించినా కానీ నితీష్ వర్గానికే బీహారీలు పట్టం కట్టారు. మొత్తంగా నాడు ఎన్టీఆర్ విషయంలో నేడు నితీష్ కుమార్ విషయంలో ఎన్డీటీవీ పప్పులో కాలువేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Prannoy Roy  Bihar  Elections  Nitesh Kumar  Bihar results  NTR in AP  

Other Articles