a telangana man named syed died in saudi arabia capital riyadh after 16 months this incident came to his family members

Telangana man died in saudi arabia after 16 months this case came to his family members

saudi arabia crime news, telanganaman died in saudi, saudi arabia news, syed died in riyadh, after 16 months family knows death mystery, telangana crimes, syed family members

telangana man died in saudi arabia after 16 months this case came to his family members : a telangana man named syed died in saudi arabia capital riyadh after 16 months this incident came to his family members

సౌదీలో తెలంగాణవాసి హత్య.. 16 నెలల తర్వాత వెలుగుచూసిన ఘటన

Posted: 11/09/2015 06:50 PM IST
Telangana man died in saudi arabia after 16 months this case came to his family members

జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ తెలంగాణవాసి అక్కడ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన సంవత్సరంపైనే అయినప్పటికీ అతని కుటుంబసభ్యులకు తెలియరాలేదు. చివరకు ఆ వ్యక్తి భార్య ఎంతో శ్రమించగా.. ఓ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి ద్వారా 16 నెలల తర్వాత అతని కుటుంబసభ్యులకు తెలిసింది. 

నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సైద్ సయ్యద్ గత ఏడాది జూన్ లో సౌదీ రాజధాని రియాద్ లోని మున్సిపాల్టీలో క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు గాను అక్కడికి వెళ్లాడు. ఉద్యోగ నిబంధనల ప్రకారం... వైద్య పరీక్షలు నిర్వహించేందుకు యాజమాన్యం అతనిని ఆసుపత్రికి పంపించింది. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో సయ్యద్ కనిపించడం లేదంటూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సయ్యద్ మృతదేహం రాజధాని శివార్లలో దొరికింది. అతని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో ఈ హత్య కేసులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా వారికి నిందితులెవరో తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం సయ్యద్ తో పాటు వెళ్లిన మనదేశానికి చెందిన కార్మికుడు, ఒక నేపాల్ జాతీయుడు ఇద్దరూ కలిసి అతనిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం వారికి జైలు శిక్ష విధించారు. అయితే... ఈ వ్యవహారం మొత్తం భారత్ లో ఉన్న సయ్యద్ భార్యకు, అతని కుటుంబసభ్యులకు తెలియదు.

సౌదీకి వెళ్లిన తన భర్త నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో సయ్యద్ భార్య జరీనాబేగం ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఏజెంట్లను, పోలీసులను సంప్రదించింది. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. చివరగా, నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి చాంద్ బాషాను ఆమె కలిసింది. ఆయన భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించగా.. అసలు విషయం బయటపడింది. సయ్యద్ మృతదేహం గుర్తుపట్టడానికి వీలులేనంతగా వుండి, కుళ్లిపోవడంతో ఆ దేశంలోనే అంత్యక్రియలు చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సయ్యద్ భార్య జరీనాబేగంకు, కుటుంబసభ్యులకు చాంద్ బాషా చెప్పడంతో వారు రోదించారు. కాగా, రియాద్ లో సయ్యద్ పని చేసేందుకు వెళ్లిన సంస్థ యాజమాన్యం, సౌదీ విదేశాంగ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం తమకు తెలియలేదని సయ్యద్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saudi arabia crime news  telangana man died in saudi  

Other Articles