Is Chandi Yagam is more important than farmers

Is chandi yagam is more important than farmers

KCR, L.Ramana, TDP, Telangana, Telangana cm KCR, TTDP, Golden Telangana

Telugudesam party telangana president L.Ramana slams telangana cm KCR for his Chandi Yagam. He said that KCR how can bring Golden telangana by Chandi Yagam

రైతుల కన్నా ఛండీయాగం ముఖ్యమా..?

Posted: 11/10/2015 08:20 AM IST
Is chandi yagam is more important than farmers

తెలంగాణ సిఎం కేసీఆర్ వచ్చే నెలలో ఆయత ఛండీయాగం చేస్తున్నారు. అయితే కేసీఆర్ చేసే యాగాల వల్ల బంగారు తెలంగాణ వస్తుందా అని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేసే చండీయాగం, ఆయన కూతురు కవిత ఆడుతున్న బతుకమ్మలతో బంగారు తెలంగాణ వస్తుందా? అని ప్రశించారు. రాష్ట్రంలో 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని, అదే చండీయాగం కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి కేసీఆర్ ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్రం నుంచి ఎలాంటి నివేదిక రాలేదని, దీంతో కరువు నిధులను మంజూరు చేయలేకపోతున్నామని కేంద్రం తెలిపిందని రమణ గుర్తుచేశారు. కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే కేసీఆర్ తన కూతురు కవిత ఆడే బతుకమ్మ పండుగల కోసం కోట్లాది రూపాయలు విడుదల చేయడం ఆయన కుటుంబ పాలనకు నిదర్శనం అన్నారు. వరంగల్ లోక్ సభా స్థానం ఉపఎన్నికలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తాడని రమణ ధీమా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై రైతు చెప్పు విసరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  L.Ramana  TDP  Telangana  Telangana cm KCR  TTDP  Golden Telangana  

Other Articles