పరీక్షలు అంటేనే స్టూడెంట్స్ కు నచ్చని విషయం. అయితే అందరూ ఏదోలా ఆ స్టేజ్ ను దాటి వచ్చే వాళ్లు. కాగా చాలా మంది పాస్ మార్కుల కోసం చాలా కష్టపడుతుంటారు. పాస్ మార్కులు 35 కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇక మీదట 35 కోసం కాకుండా 20 కోసం కష్టపడితే చాలు. పరీక్షలో 35 వస్తే పాస్ అన్న నిబంధనను సవరించి.. 20 కే పాస్ అంటూ తాజాగా కొత్త మార్పులు తీసుకువచ్చారు. అయితే పాస్ మార్కులు 35 నుండి 20 కి తగ్గాయంటే సంబర పడుతున్నారేమో కానీ ఇక్కడ కూడా కండీషన్స్ అప్లై అన్నట్లుంది. ఎందుకంటే ఇది కేవలం పదో తరగతి పరీక్షల్లో.. అది కూడా ఒక సబ్జెక్టుకు మాత్రమే.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో సెకండ్ ల్యాంగ్వేజ్ పాస్ మార్కులపై గందర గోళం నెలకొన్నది. గతేడాది పబ్లిక్ పరీక్షల్లో ద్వితీయ భాష హిందీలో 35 మార్కులు సాధించాలని విద్యాశాఖ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. నిరంతర సమగ్ర మాల్యాంకనాన్ని గతేడాదే ప్రారంభించటంతో హిందీలో మిగితా సబ్జెక్టుల్లా కాకుండా పాస్ మార్కులు 20గా నిర్ణయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో పాస్ మార్కులను 35 నుంచి 20కి తగ్గిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులంతూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి చాలా మంది స్టూడెంట్స్ కు చుక్కలు చూపించిన సెకండ్ ల్యాంగ్వేజ్ పాస్ మార్కులు 20 కి తగ్గడం చాలా మందికి ఆనందం కలిగిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more