Pak media slams modi and BJP

Pak media slams modi and bjp

Pakitan, India, BJP, Modi, Bihar, Elections, Bihar Results, Bihar Polls, Pakistan Media, Dawn, pakistan Daily dawn

Leading Pakistani newspapers today ran front-page stories on Prime Minister Narendra Modi-led BJP’s rout in the key Bihar polls, in which Pakistan figured as a major issue during campaigning that saw party president making the controversial “firecrackers would go off” remark.

మోదీకి, బిజెపికి తలంటిన పాక్ మీడియా

Posted: 11/10/2015 09:38 AM IST
Pak media slams modi and bjp

పాకిస్థాన్ న్యూస్ లో బారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మారుమోగుతోంది. ఏ పేపర్ లో చూసినా కానీ మోదీ న్యూస్ కనిపించింది. అయితే ఎందుకు అంత కవరేజ్ అనుకుంటున్నారా..? మోదీ బీహార్ లో వైఫల్యం చెందడం పాక్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ గా మారింది. బీహార్ లో ఒకవేళ బిజెపి ఓడిపోతే పాకిస్థాన్ లో టపాసులు పేలుతాయని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసింది పాక్ మీడియా. ఒక్క పాక్ మీడియాలోనే కాదు అంతర్జాతీయ మీడియా ఛానల్స్ కూడా మోదీ పరాభవం మీద ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. పాక్ ప్రముఖ పత్రిక డాన్ అయితే ఫ్రంట్ పేజ్ లో మోదీ టపాసులను బీహార్ దోచుకుంది అని కథనం ప్రచురించింది.

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ సాధించిన ఘన విజయం గురించి అన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్లు కథనాలు ప్రచురించాయి. తాజాగా అదే మోదీ కేంద్రంలో అధికారంలో ఉండగా ఎన్డీయే పక్షం ఘోరంగా విఫలం కావడం మీద కథనాలు ప్రసారమయ్యాయి. బీహార్ ఎన్నికల సందర్భంగా అమిత్ షా చేసిన పాకిస్థాన్ వేడుకల వ్యాఖ్యలు, దేశంలో పెరుగుతున్న అసహనం, గోమాంసం వివాదం ఇలా చాలా కారణాల వల్ల మోదీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఒకటిగా మారి బిజెపి పార్టీని ఓడించాయి అని డాన్ తన కథనంలో వెల్లడించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakitan  India  BJP  Modi  Bihar  Elections  Bihar Results  Bihar Polls  Pakistan Media  Dawn  pakistan Daily dawn  

Other Articles