Lalu Prasad force to give Depty CM post for his daughter

Nitesh getting troubles from lalu

bihar, Elections, Lalu Prasad, lalu prasad daughter, Meesa Bharati, lalu Prasad sons, Bihar cm Nitesh, Nitesh Kumar, Nitesh Kumar with lalu

Nitesh Kumar facing problems with Lalu prasad. Lalu prasad got more seats than Nitesh Kumar party. Lalu Prasad forcing to give Depty. CM to his daughter Meesa Bharati.

నితీష్ కు ముందుంది ముసళ్ల పండగ

Posted: 11/10/2015 10:17 AM IST
Nitesh getting troubles from lalu

బీహార్ ఎన్నికల్లో మహా కూటమి అఖండ విజయాన్ని అందుకుంది. ఎన్డీయే పక్షానికి చుక్కలు చూపించి.. ఆర్జేడీ, జెడియు, కాంగ్రెస్ పక్షాలు గెలుపును సొంతం చేసుకున్నాయి. అయితే మహా కూటమిలో అన్ని పార్టీల కన్నా నితీష్ కుమార్ పార్టీ కన్నా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. దాదాపు 15 సంవత్సరాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. అయితే గత ఎన్నికల్లో కేవలం 22 సీట్లను సొంతం చేసుకున్న పార్టీ 58 సీట్లను అధికంగా సాధించి మహా కూటమిలో తిరుగులేని పెద్ద పార్టీగా ఎదిగింది. అయితే లాలూ ప్రసాద్ యదవ్ బీహార్ కు కాబోయే సిఎం నితీష్ కుమార్ కు సినిమా చూపిస్తున్నారు.

Also Readసమోసాలో ఆలు.. బీహార్ లో లాలూ
Also Read: లాలూ యాదవ్ కాదట.. నకిలీ యాదవ్ అంట..!

ఎన్నికల ఫలితాలు వెల్లడై కనీసం రెండు రోజులు కూడా గడవక ముందే లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడే నితీష్ కుమార్ మీద వత్తిడి చేస్తున్నట్లు సమాచారం. లాలూ ప్రసాద్ యదవ్ ఇద్దరు కుమారుల్లో ఒకరు మంత్రి పదవిని దక్కించుకుంటారని తెలుస్తుండగా తాజాగా లాలూ తన కుమార్తెకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాలూ కుమార్తె మీసా భారతి కనీసం ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు.. కానీ ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం ఆశిస్తున్నారు లాలూ. మీసాకు ఎమ్మెల్సీ సీటు ఇప్పించి.. అలా ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలని లాలూ స్కెచ్ వేశారు. మొత్తం 30 నుడి 35 మంత్రి పదవులు ఉండగా అందులో లాలూ వర్గానికి 20 వరకు వస్తాయని అంచనా.

Also Readలాలూ ప్రసాద్ కొడుకుల పిట్ట కథలు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  lalu Prasad  Meesa Bharati  Nitesh Kumar  

Other Articles