Why media giving full coverage to Pawan Kalyan

Media coverage to pawan kalyan

Media Coverage, Janasena President Pawan Kalyan will meet AP CM Chandrababu Naidu in the afternoon. He will discuss about Amaravati, farmers land issue and special status for ap.

Telugu Media giving full coverage to Janasena party President and Power star pawan Kalyan. Pawan kalyan spoke for the people and he is not trying for showups.

పవన్ కళ్యాణ్ కు మీడియా కవరేజ్ ఎందుకు..?

Posted: 11/12/2015 01:42 PM IST
Media coverage to pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణం, రైతుల నుండి భూములను తీసుకోవడంలాంటి కీలక అంశాల మీద చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరిన దగ్గరి నుండి అన్ని మీడియా ఛానల్స్ లో ఫుల్ కవరేజ్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కనీసం ట్వీట్ చేసినా కానీ వెంటనే బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి. ఎందుకు అంతగా పవన్ కళ్యాణ్ కు మీడియా కవరేజ్ ఇస్తోంది అంటే దానికి చాలా కారణాలున్నాయి. పవన్ కళ్యాణ్ మీద తెలుగు మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ వెనుక అంతరార్థం ఉంది.

Alsoe Read: టిటిడిపికి 'పవన్ కళ్యాణ్' ఆక్సిజన్..?

పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. సినిమా పరంగానే కాకుండా పవన్ వ్యక్తిత్వం ఎంతో మందిని అతడి అభిమానులుగా చేసింది. తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నప్పుడు అందరూ కూడా పవన్ ను సమర్థించారు.. తమ సపోర్ట్ ను తెలిపారు. ఇప్పటి దాకా జనసేన పార్టీ అధినేతగా కేవలం ఒకే ఒక్క సారి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు కానీ తిరుగులేని ఫలితాలను అందుకున్నారు పవన్. ప్రత్యర్థుల మీద సహేతుకంగా విమర్శలు గుప్పించడంతో పాటు.. పలానా పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలి అన్న దాని మీద పవన్ చాలా క్లారిటీ ఇచ్చారు. మీడియా సమావేశాల్లో కూడా పవన్ చాలా నేర్పుగా మాట్లాడటం గమనించాలి.

Alsoe Read: నయా ట్రెండ్: పంచెకట్టులో పవన్

రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కునేందుకు ఏపి సర్కార్ ప్రయత్నిస్తే.. దాన్ని వ్యతిరేకించారు. మిత్రపక్షమే అయినా కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించారు. రైతులకు అండగా నిలిచి ల్యాండ్ పూలింగ్ క వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించారు. కానీ మీడియా పెద్దలకు కూడా ఇది కొత్తగా అనిపించింది. పవన్ లాంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఏంటో అప్పటికి తెలిసింది. రాజకీయ ప్రకటలు చెయ్యడంలో ఎప్పుడూ ముందుండే వారిలా కాకుండా మాట్లాడిన ప్రతిమాట ప్రజలక కోసమే.. ప్రజా పక్ష మే అన్నట్లు పవన్ వ్యవహరించే తీరు మీడియాలో పవన్ కు ఫుల్ కవరేజ్ వచ్చేలా చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Media Coverage  Pawan Kalyan  Janasena  Farmers  AP  Capital  Amaravati  Chandrababu Naidu  

Other Articles