Telangana govt will release TET notification

Telangana govt will release tet notification

TET, DSC, Telanagana, Teacher Eligibility Test, TET Exam, DSC in Telangana

Telangana govt getting ready to release TET notification on 16th Nov. Online applications will starts from 18th November.

ఈ నెల 16న టెట్ నోటిఫికేషన్

Posted: 11/13/2015 08:44 AM IST
Telangana govt will release tet notification

టీచర్ పోస్టులకు డిఎస్సీ ఎప్పుడు..? డిఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహిస్తారా...? టెట్ ను డీఎస్సీలోనే కలిపేస్తారా..? అన్న ప్రశ్నలకు తెర పడింది. టెట్ పరీక్ష తేదిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. టెట్ వచ్చే ఏడాది జనవరి 24న నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసి, 18 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌టెట్ కన్వీనర్ జగన్నాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 18న టెట్ పరీక్ష సమాచారానికి సంబంధించి బుక్‌లెట్‌ను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. టీఎస్‌టెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి WWW.TSTET.GOV.IN వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. జనవరి 24, 2016న టీఎస్‌టెట్ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం గతంలో నిర్వహించిన మాదిరిగానే టీఎస్‌టెట్ నిర్వహిస్తామని కన్వీనర్ జగన్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌కు నాలుగు లక్షలమంది విద్యార్థులు హాజరవగా, ఈసారి ఐదు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలు ఉన్నాయని టీఎస్‌ టెట్ అధికారులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TET  DSC  Telanagana  Teacher Eligibility Test  TET Exam  DSC in Telangana  

Other Articles