Harish rao challenge to resingnation

Harish rao challenge to resingnation

Harish Rao, Congress, Warangal, Elections, TRS, Uttam Kumar Reddy

Telangana Irrigation minister harish Rao said that will Uttam Kumar Reddy ready to resign if congress defeat in warangal elections.

రాజీనామాకు సిద్దమా..? హరీష్ రావ్ సవాల్

Posted: 11/13/2015 08:46 AM IST
Harish rao challenge to resingnation

అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 500 రోజుల పాలనలో ఏం చేసిందంటూ కాంగ్రెస్‌ పార్టీ పుస్తకాన్ని విడుదల చేయడంపై ఆయన మండిపడ్డారు. ఒక ప్రకటన చేస్తూ ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగడం వల్లే తెలంగాణకు ఈ రోజు దుస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రా నేతల పల్లకీలు మోసి తెలంగాణ ప్రజలను పాడెలెక్కించారని హరీష్ రావ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం తాము ఏం చేశామో చెప్పడానికి చాలా ఉన్నాయని, కాంగ్రెస్‌ మాదిరి అద్భుతాలు చేస్తామని చెప్పలేదన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టు కోకుంటే మళ్లీ ఎన్నికలప్పుడు ఓట్లు అడగబోమని ప్రకటించిన వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని హరీష్ రావ్ వెల్లడించారు. ఇంత ధైర్యంగా ముందుకొచ్చిన పార్టీని దేశంలో ఎక్కడైన, ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. కెసిఆర్‌ ఆలోచన విధానమే వేరని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్‌టిసి బాగుపడిందన్నారు. నష్టాల ఊబిలో ఉన్న ఆర్‌టిసి డిపోలు లాభాల బాటన పడ్డాయన్నారు. సింగరేణి బాగుపడ్డదన్నారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ రంగాన్న గట్టెక్కించామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఒక్క చెరువు కూడా బాగు చేయలేదన్నారు. వరంగల్‌ ఉపఎన్నికలను తమ ప్రభుత్వ పాలనకు రెఫరెండమ్‌గానే తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ఓడితే ఉత్తమకుమార్‌రెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Rao  Congress  Warangal  Elections  TRS  Uttam Kumar Reddy  

Other Articles