సభ్యసమాజం తలదించుకునే దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల.. యువతికి చెందిన కుటుంబసభ్యులు ఆ యువకుడి తల్లిని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. తీవ్రగాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన సంఘటన యూపీలోని లాహర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
లాహర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు.. మురళీదౌర్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ.. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు చెప్పి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ పెళ్ళికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అనంతరం ఆ అబ్బాయితో కలవనివ్వకుండా యువతిని ఇంట్లోనే బంధించేశారు. ఒకర్నొకరిని వదిలి వుండలేకపోయిన ఆ ప్రేమజంట... చివరికి కోర్టు అనుమతితో గత ఫిబ్రవరిలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకుంది. దీంతో యువతి కుటుంబసభ్యులు.. యువకుడి కుటుంబంపై ఆగ్రహం పెంచుకున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కక్ష గట్టారు. అనుకున్నదే ఆలస్యం.. వెంటనే యువకుడి కుటుంబంపై దాడి చేసి, అతని తల్లిదండ్రులు, సోదరుడిని విచక్షణారహితంగా చావబాదారు.
అంతటితో వారి ఉన్మాదం చల్లారలేదు. యువకుడి తల్లి జుట్టు పట్టి బయటికి లాక్కొచ్చి మరీ విపరీతంగా చితక్కొట్టారు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి, వివస్త్రను చేశారు. కొట్టుకుంటూ వీధుల్లో సుమారు రెండు గంటలపాటు నగ్నంగా ఊరేగించి, భీతావహం సృష్టించారు. గ్రామంలో వున్న స్థానికులు చూస్తూ వుండిపోయారు కానీ.. వీరిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తనని వదిలేయమని ఆ తల్లి ఎంత వేడుకున్నా.. ఆ రాక్షసులు ఆమెను వదలలేదు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి రాంప్రకాష్, జైసింగ్, విజయ తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి అవినాష్ తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more