Telugu students made childrens day doodle

Telugu students made childrens day doodle

Google, Doodle, Childrens day, childrens day doodle, AP, students make doodle

On the occasion of Children’s Day that also marks the birth anniversary of the India's first prime minister Pandit Jawaharlal Nehru, Google’s homepage is adorned with a special doodle created under its Doodle 4 Google 2015 contest. As part of its annual Doodle 4 Google - India contest, the search giant invites entries from children across the country and the winning entry gets featured on its homepage. This year, the theme for the Google 4 Doodle was ‘Create Something for India’.

గూగుల్ డూడుల్ అదిరింది.. చేసింది తెలుగు విద్యార్థి

Posted: 11/14/2015 09:40 AM IST
Telugu students made childrens day doodle

గూగుల్ గ్రీటింగ్స్ చెప్పడానికి వాడే డూడుల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. టీచర్స్ డే, ఫాదర్స్ డే గ్రీటింగ్ చెప్పడానికి గూగుల్ తయారు చేసిన డూడుల్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. తాజాగా చిల్డ్రన్స్ డే సందర్భంగా గూగుల్ ప్రజెంట్ చేసి డూడుల్ చాలా అద్భుతంగా ఉంది. అయితే గూగుల్ డూడుల్ కోసం నిర్వహించిన పోటీల్లో అందరిని కాదని మొదటి స్థానాన్ని సాధించిన డూడుల్ మన తెలుగు విద్యార్థి రూపొందించడం విశేషం. కాగా టాప్ ఎంట్రీల్లో మొదటి, రెండో ఎంట్రీలు మన తెలుగు విద్యార్థులు చేసినవే కావడం విశేషం. క్రియేట్ సంధింగ్ ఫర్ ఇండియా అనే ధీమ్ తో తయారు చేసిన డూడుల్ అందరిని ఆకర్షిస్తోంది. పి. కార్తీన్ అనే ఏపి విద్యార్థి తయారు చేసిన ఎర్త్ మెషీన్ డూడుల్ అద్బుతంగా ఉండటంతో గూగుల్ దాన్నే డూడుల్ గా వాడింది.



కార్తీక్ తయారు చేసిన ఎర్త్ మెషీన్ ప్లాస్టిక్ నుండి నేచర్ ను డెవలప్ చేసే విధంగా కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తున్నట్లు చూపిస్తోంది. చిన్నారి చేతులు తలుచుకుంటే దేన్నైనా మార్చేస్తారు అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక ఏపికి చెందిన మరో విద్యార్థిని పి. రమ్య తయారు చేసిన డూడుల్ కూడా రెండో స్థానాన్ని పొందింది. గ్రీన్ సిటీ.. డ్రీమ్ సిటీ అన్నట్లు ఉంది. తాను ఓ గ్రీన్ సిటీని తయారు చేస్తానని.. అక్కడ కేవలం గ్రీన్ రిసోర్సెస్ ద్వారా ఎనర్జీని సృష్టించడమే కాకుండా అక్కడ అందరికి సమాన అవకాశాలు కల్పించబడతాయి అని రమ్య వివరించింది. మొత్తంగా తెలుగు వారి వెలుగులు చిన్నారులు కూడా ఎగరవేస్తున్నారు. వారందరికీ మా అభినందనలు. అలాగే చిన్నారుల దినోత్సవం సందర్భంగా ప్రతి చిన్నారికి తెలుగు విశేష్ శుభాకాంక్షలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Doodle  Childrens day  childrens day doodle  AP  students make doodle  

Other Articles