They killed 17 that time and now killed 170 people

They killed 17 that time and now killed 170 people

ISIS, paris, ISIS attack on Paris, ISIS Terrorists, Terrorists, paris, France, Terror, Attack, paris Attack, explosions in paris, shootings in Paris

Terrified hostages told how IS thugs slaughtered victims “one by one” during a siege at a concert hall as Paris was plunged into murderous chaos. At least 60 people had been killed in the gun and bomb attacks said to have been launched in revenge for the US missile strike that killed British terror thug Jihadi John in Syria.

అప్పుడు 17 మంది.. ఇప్పుడు 170ని చంపారు

Posted: 11/14/2015 10:18 AM IST
They killed 17 that time and now killed 170 people

ప్యారిస్ నగరంలో కాల్పుల మోత మోగింది.. బాంబులతో వీధలన్నీ చెల్లాచెదరయ్యాయి. ప్యారిస్ లాంటి నగరంలో ఉగ్రవాదులు సృష్టించిన మరణకాండ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 170 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు కరడుగట్టిన ఉగ్రవాదులు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎంతో మంది రక్తపు మడుగులో మునిగిపోయారు. విచక్షణా రహితంగా రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని మరీ కాల్పులకు తెగపడ్డారు ఉగ్రవాదులు. అయితే ఆ కాల్పులకు తామే కారణం అంటూ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. గతంలో కూడా ప్యారిస్ నగరం మీద కాల్పులకు తెగించింది ఐఎస్. తాజాగా ఏకంగా 170 మందిని కాల్చి చంపడం వార్తల్లో నిలుస్తోంది.

Also Read: ప్యారిస్ లో ఉగ్రపంజా.. 140 మంది మృతి

గతంలో చార్లి హెబ్డో పత్రిక కార్యాలయం వల్ల కాల్పులు జరిపి ఏకంగా 17 మందిని కాల్చి చంపారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. తమ దేవుడిని అవమానించేలా కార్టూన్లు వెలవరించిందని ఈ దాష్టికానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. తాజాగా మరో సారి అధునాతన గన్ లతో విచక్షణ లేకుండా .. నిర్దాక్షిణ్యంగా ప్రజల ప్రాణాలను తీసుకున్నారు ఉగ్రవాదులు. కాగా ప్యారిస్ మీద జరిగిన దాడిని అన్ని దేశాలు ఖండించాయి. మానవ హక్కుల మీద జరిగిన దాడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ఫ్రాన్స్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీని ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం అక్కడి భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. కాగా ఆరుగురు ఉగ్రవాదులు చేసిన దాష్టీకం అని అధికారులు అంటున్నారు. కానీ ఆరుగురు మాత్రమే కాదని.. చాలా మంది ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles