ACB Officers ride on Kukatpally ACP House

Acb officers ride on kukatpally acp house

ACB, ACP, ACB Ride, Kukatpally, Kukatapally ACP, Sanjeeva Rao, ACP Sanjeeva Reddy, Police, TS Police

ACB officers ride on Kukatpally ACP Sanjeeva Rao house in Alawal in this early morning. ACB got near two crore property from ACPs house.

ITEMVIDEOS: ఆ ఏసీపీ.. ఓ అవినీతి తిమింగళం

Posted: 11/14/2015 11:12 AM IST
Acb officers ride on kukatpally acp house

నాన్నా అతిగా ఆశడపడ్డ ఆడది. ఆశేశపడ్డ మగాడు సుఖపడ్డట్లు చరిత్రలో లేదు అని రజినీ కాంత్ చెప్పినా కానీ మారకపోతే.. అది చివరకు పతనానికే దారి తీస్తుంది. తాజాగా పోలీస్ శాఖలో వెలుగు చూసిన ఓ పెద్ద తిమింగళం వ్యవహారం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంచి జీతం.. మంచి జీవితం ఉన్నా ఓ పోలీస్ ఉన్నతాధికారి అవినీతికి అలవాటు పడి.. కోట్లకు కోట్లు పోగేశాడు. చిరవకు ఏసీబీ అధికారుల రైడింగ్ లో పట్టుబడ్డాడు. పోలీస్ అనే పేరును అడ్డం పెట్టుకొని.. అడ్డదిడడ్డంగా సంపాదించిన ఏసీపీని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా రెండు కోట్ల రూపాయాల డబ్బును నిల్వ ఉంచుకోవడాన్ని చూసి ఏసీబీ వాళ్లకే దిమ్మతిరిగిపోయింది. రాజమహల్ లాంటి ఇల్లు, సకల సదుపాయలతో కూడిన ఇల్లులోనే బిక్కుబిక్కు మంటూ.. ఏసీబీ వాళ్లకు సామాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.

Also Read: అవినీతి చెక్ పోస్టులు.. తెలంగాణలో ఏసీబీ సోదాలు

కూకట్ పల్లి ఏసీపీ సంజీవ రావు ఇంట్లో ఈ తెల్లవారుజాము నుండి చేస్తున్న రైడింగ్ లలో డబ్బులు దండి లభించాయి. అల్వాల్ లోని సంజీవరావు ఇల్లును చూసిన ఏసీబీ అధికారులకు షాక్ తగిలింది. ఇంద్రభవనంలాంటి ఇంట్లో సకల సదుపాయాలున్నాయి. సీలింగ్ దగ్గరి నుండి బెడ్ రూం వరకు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎంతో కాలంగా అవినీతికి అలవాటుపడ్డ సంజీవరావు కష్టపడి లంచాలకు అలవాటుపడి కోట్లు పోగేవాడని తెలుస్తోంది. ఏసీబీ సోదాల్లో భారీ ఎత్తున నగదు, ఆస్తి పత్రాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శామీర్ పేట, వరంగల్ లోనూ పెద్ద ఎత్తున భూములు కూడా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. చూడాలి మరి ఇంకా ఎంత పోగేవాడో ఏసీబీ వాళ్లే తేల్చాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  ACP  ACB Ride  Kukatpally  Kukatapally ACP  Sanjeeva Rao  ACP Sanjeeva Reddy  Police  TS Police  

Other Articles