Thief used police bike for thefting

Thief used police bike for thefting

Police, Thief, chain snatching, chain snatchers, Mohan, Constable Mohan, chain snatching in Hyderabad

A Thief used police bike for thefting. Police arrest a theif in Hyderabad.. He told that he has a police friend and he gave the bike.

చైన్ స్నాచింగ్ కు పోలీస్ బైక్

Posted: 11/14/2015 11:14 AM IST
Thief used police bike for thefting

పోలీస్ లు దొంగలు ఒక్కటే.. ఎందుకంటే దొంగలుండేది పోలీస్ స్టేషన్లో పోలీసులతో పాటే.. అని చాలా మంది దొంగలు చెబుతుంటారు. అందుకే మనం మనం ఒక్కటే అని పోలీసులతో దోస్తీకి చాలా మంది రెడీ అవుతుంటారు. అయితే పోలీస్ శాఖలో దొంగ పోలీసులు చాలా మంది ఉంటారు. అలా ఓ పోలీస్ కూడా దొంగతో దోస్తాన్ చేసి ఇరుకున పడ్డారు. దొంగతనం చెయ్యడానికి తను కూడా పరోక్షంగా పోలీస్ సపోర్ట్ చేస్తుంటే దొంగ ఎంత మాత్రం ఊరికే ఉంటారా..? ఏంటీ.? చేతివాటం చూపించడా..? అయితే అలా చేతివాటం చూపించే టైంలోనే పోలీసులకు దొరికి పోయాడు. పోలీసులకు ఆ దొంగ నుండి వచ్చిన సామాచారం విని షాక్ అయ్యారు. దొంగతనం చెయ్యడానికి దొంగ వాడిన బైక్ పోలీస్ శాఖదే. అవును దొంగ పోలీస్ బైక్ వేసుకొని జాలీగా దొంగతనం చేసే వాడట. మొత్తం స్టోరీ చదవండి. షాక్ అవుతారు.

Also Read: మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. తీవ్రంగా గాడపడ్డ మహిళ

అసలే దొంగ ఆ మీదట పోలీస్ సపోర్ట్ ఇక మన వాడికి అడ్డు అడుదూ లేకుండా పోయింది. ఇష్టంవచ్చినట్లు తన ప్రతిభను చూపించాడు. తాజాగా చైన్ స్నాచింగ్ లు చేస్తూ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు. అయితే పోలీసులు స్నాచింగ్ చేస్తున్న టైంలో పట్టుకొని.. విచారిస్తే అసలు మ్యాటర్ ఏంటో తెలిసింది. తాజాగా మహ్మద్ అనే చైన్ స్నాచర్న్ ను పోలీసులు పట్టుకున్నారు. అయితే చైన్ స్నాచింగ్ కు వెళ్లినప్పుడు అతడు వాడిన బైక్ గురించి ఆరా తీస్తే అది పోలీసుల బైక్.. ఇదేంటని ప్రశ్నిస్తే మొత్తం వివరించాడు మహ్మద్. నారాగూడ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న మోహన్ అనే కానిస్టేబుల్ తనకు స్నేహితుడిని వివరించాడు. అలాగే చాలా సార్లు తాను జైలులో ఉంటే వచ్చి కలివాడని కూడా తెలిపాడు. మహ్మద్ మోహన్ కు 1.90లక్షల విలువైన కొట్టకొచ్చిన బంగారాన్ని బహుమతిగా కూడా ఇచ్చాడట. మహ్మద్ మాటలు విన్న పోలీసులు షాక్ తిన్నారు. ఉన్నతాధికారులు మోహన్ ను ప్రస్తుతం విధుల నుండి తప్పించారు. ఒకవేళ మోహన్ మీద వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే మాత్రం సస్పెన్షన్ తప్పదు.


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Thief  chain snatching  chain snatchers  Mohan  Constable Mohan  chain snatching in Hyderabad  

Other Articles