ఆధ్యాత్మిక ముసుగులో ప్రజల నుంచి డబ్బులు దండుకునే దొంగబాబాల బాగోతాలు ఇప్పటికే ఎన్నోసార్లు బయటపడినప్పటికీ.. వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కుప్పలు తెప్పలుగా దొంగబాబాలు పుడుతూనే వున్నారు. ఈ దొంగబాబాల్నినమ్మొద్దంటూ ఎన్నిరకాలుగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేసినా.. వారిలోనూ మార్పు రావడం లేదు. ఎవరైనా కాస్త మేజిక్ చేసి తమనుతాము బాబాగా పరిచయం చేసుకుంటే చాలు.. అతనికి నీరాజనాలు పలుకుతారు. ఈ బలహీనతను పసిగట్టిన దుండగులు.. బాబాలుగా వేషాధారణ చేసి, డబ్బుల్ని బాగానే కాజేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రజల్ని మోసం చేసి కోట్లు కాజేసిన మరో దొంగబాబా బాగోతాన్ని తెలుసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన మద్దూరు ఉమాశంకర్ (49) అనే వ్యక్తి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం 2004లో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. తొలుత ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇతగాడు.. డబ్బు సంపాదన కోసం ఉమాశంకర్ స్వామి అవతారం ఎత్తాడు. పైగా.. మార్కెట్ లో దొంగబాబాల ట్రెండ్ బాగానే నడుస్తోంది కాబట్టి.. ఆ దిశగా అడుగులు వేశాడు. మొదట జాతకాలు చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్‌కేపురంలో ఉంటూ తన స్నేహితులు దుర్గాప్రసాద్, సీఎంకే.రావు సహకారంతో ‘అవర్ ప్లేస్’ పేరుతో భక్తుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. దీనికితోడు రాజమండ్రి, గుడివాడ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించి... వ్యాపారులను, బడా వ్యక్తులను మోసం చేసి వారినుంచి కాజేసిన డబ్బుతో శంషాబాద్‌లో బినామీ పేర్లతో 4.25 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో అతని చేతిలో మోసపోయిన కొత్తపేట ఇన్‌కాంట్యాక్స్ కాలనీకి చెందిన వెంకటరమణారావు బుధవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దాదాపు 50 మంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం పోలీసులు ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆధ్యాత్మిక ముసుగులో ఇతను సుమారు రూ. 30-40 కోట్లు వసూలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more