finally the tv journalist reham khan reveals the truth behind divorce with former cricketer and politician imran khan | reham imran khan news

Tv journalist reham khan reveals the truth behind divorce with former cricketer imran khan

reham khan, imran khan, former cricketer imran khan, imran khan with reham khan, reham khan controversy, imran khan controversy, imran khan divorce, reham khan divorce

tv journalist reham khan reveals the truth behind divorce with former cricketer imran khan : Two weeks after Imran Khan's second marriage ended in a divorce in just 10 months, Reham has spoken out, claiming that she was told that she should be making chapatis in the kitchen and not to be seen outside.

మాజీ క్రికెటర్ ఇమ్రాన్ అలాంటివాడట.. రెండో భార్య సంచలనం!

Posted: 11/16/2015 02:04 PM IST
Tv journalist reham khan reveals the truth behind divorce with former cricketer imran khan

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తన రెండో భార్య రేహమ్ ఖాన్ (టీవీ జర్నలిస్ట్)కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనుకోకుండా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి, పెళ్ళిదాకా వచ్చింది. కానీ.. ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ.. వీరి ప్రేమపెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటగానే ముసిగింది. విడాకులు కూడా తీసుకున్నట్లు ఇద్దరూ తమ ట్విటర్ ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ విడాకుల విషయంపై ఇన్నాళ్లూ మౌనంగానే వున్న రేహమ్ ఖాన్.. ఇప్పుడు ఇమ్రాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్లే తాను అతనితో విడాకులు తీసుకున్నట్లుగా ఆమె వెల్లడించింది. అంతేకాదు.. అతని లక్షణాల వల్ల తాను అనుభవించిన బాధల్ని ఆమె వివరించింది.

తాను బయట కనబడరాదంటూ ఇమ్రాన్ ఆర్డర్ వేసేవాడని, వంటింట్లోనే వుంటూ చపాతీలు చేయాలని చెప్పేవాడని రేహమ్ అతనిపై మండిపడింది. రోజుకు కేవలం ఒక్క చపాతీ మాత్రమే తినేవాడని చెప్పింది. ఎంతసేపు తనన వంటింటి కుందేలుగానే చేయాలని ఇమ్రాన్ చూశాడని ఆరోపించిన రేహమ్... రాజకీయాల్లోకి రావాలన్న తన కోరికను కూడా అతగాడు చంపేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతనితో సంతోషంగా జీవితం కొనసాగించేందుకు ఎన్నిరకాలుగా తనని తాను మార్చుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయింది. ఇంట్లో తాను గలగలా మాట్లాడుతుంటే, ఇమ్రాన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉండేవాడని రేహమ్ ఖాన్ విమర్శించింది. ఇంట్లోని కర్టెన్ల రంగు గురించి కూడా ఆయనతో మాట్లాడరాదని... కేవలం రాజకీయాల గురించి మాత్రమే నిత్యం చర్చిస్తూ వుండాలని చెప్పింది. అంతెందుకు.. బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడటం కూడా ఆయనకు ఇష్టం ఉండదని.. ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా విసుక్కొని పక్కకు వెళ్లిపోయేవాడని తెలిపింది.

ఇమ్రాన్ ను మార్చాలని తాను ఎంతగానో ప్రయత్నించానని, అయినా కాలేదని రేహమ్ తెలిపింది. తాను అబద్ధం చెప్పదలుచుకోలేదని.. తాను గృహ హింసకు గురయ్యానని స్పష్టం చేసింది. ఏనాడూ తనతో సఖ్యతగా వ్యవహరించలేదని, ప్రతి చిన్న విషయంపై తన మీద అలిగేవాడని ఆమె పేర్కొంది. నా గతం గురించి ఇమ్రాన్ కు తెలిసినప్పటికీ... ఎప్పుడూ దాని గురించే ఆలోచించేవాడని విమర్శించింది. బీబీసీలో జర్నలిస్టుగా పనిచేసిన రేహమ్ కు గతంలోనే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలావుండగా.. రేహమ్ చేసిన వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ ను మీడియా ప్రశ్నించగా... ఆయన స్పందించలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reham khan  imran khan  pakistan crime news  

Other Articles