A Bal Thackeray Memorial in Mumbai

A bal thackeray memorial in mumbai

BJP, Shiv Sena, Maharashtra, civic polls, Kalyan Dombivali, Devendra Fadnavis, Uddhav Thackeray, Bal Thackeray, Bal Thackeray memorial

A memorial to Shiv Sena founder Bal Thackeray will be located at the Mumbai's Mayor's bungalow, Maharashtra Chief Minister Devendra Fadnavis announced today. By his side sat Shiv Sena chief and Bal Thackeray's son Uddhav, who thanked the Chief Minister.

ముంబైలో బాల్ ధాక్రే స్మారకం

Posted: 11/17/2015 03:52 PM IST
A bal thackeray memorial in mumbai

ఎప్పుడూ కారాలు మిరియాలు నూరే శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ధాక్రే మహారాష్ట్ర సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. బాల్ థాకరే స్మారకాన్ని  ముంబై  మేయర్ బంగ్లావద్ద ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర సీఎం  దేవేంద్ర ఫద్నవీస్ స్పష్టంచేశారు. బాల్ థాకరే వర్థంతి సందర్భంగా  జరిగిన సమావేశంలో  ఉభయనాయకులు పాల్గొన్నారు. 2012 నవంబర్18న బాల్ థాకరే  అంత్యక్రియలు  జరిగిన శివాజీ పార్క్ లోనే ఈ సమావేశం జరిగింది. ఇటీవల బీజేపీ – శివసేన మధ్య  విబేధాలు తలెత్తిన తర్వాత,  గతనెల  కల్యాణ్- దోంబివలి  కార్పొరేషన్ ఎన్నికల్లో రెండుపార్టీలు  ప్రత్యక్షంగా పోరాడిన తర్వాత  ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ పాల్గొన్న తొలి సమావేశం ఇదే.

Also Read: పాకిస్థాన్ కు ధన్యవాదాలు అంటున్న శివసేన

బాల్ థాకరే అంత్యక్రియలు జరిగిన శివాజీ పార్క్ లో మారుమూల తాత్కాలికంగా నిర్మించిన ఓ స్మారకం ఉంది.   మహానేతకు  తగిన స్మారకం నిర్మిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించి, ఎక్కడ నిర్మించాలో నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ  మేయర్ బంగ్లా  ప్రదేశంలో  నిర్మించాల్సిందిగా  చేసిన సూచనను  రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది.  దాదర్ లోని శివాజీ పార్క్  సమీపంలో సముద్రానికి అభిముఖంగా  బాల్ థాకరే స్మారక చిహ్నం నిర్మిస్తారు.  ఈ ప్రదేశంలోనే  1966లో  శివసేనను ప్రారంభిస్తున్నట్లు బాల్ థాకరే ప్రకటించారు.  ఆయన హయాంలో  ప్రతిఏటా దసరా ర్యాలీలు ఇక్కడే జరిగేవి.  బాల్ థాకరే స్మారకానికి ఎంతమొత్తంలో నిధులు కేటాయిస్తారో.. చెప్పకుండా..  మహానేత   మహారాష్ట్రకు చేసిన సేవలను డబ్బుతో తూచలేమని,  అవసరమైన నిధులను రాష్ట్రప్రభుత్వం  సమకూరుస్తుందని   దేవేంద్ర ఫద్నవీస్  వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles