t9 news channel ceo mallareddy along with three members arrest in cheating case | t9 news channel ceo cheating case | cheating cases

T9 news channel ceo mallareddy arrest in cheating case along with three members

t9 news channel ceo mallareddy arrest, mallareddy arrest in cheating case, t9 news channel cheating case, t9 news channel ceo cheating case, jobs cheating cases, four members arrest in cheating case

t9 news channel ceo mallareddy arrest in cheating case along with four members : t9 news channel ceo mallareddy along with three members arrest in cheating case.

చీటింగ్ కేసులో అరెస్టయిన టీ9 ఛానల్ సీఈవో

Posted: 11/18/2015 11:17 AM IST
T9 news channel ceo mallareddy arrest in cheating case along with three members

ఎంతటి ఉన్నత స్థానంలో వుంటేనేం.. డబ్బుపిచ్చి మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చుతుందనే అనే మాటకు నిదర్శనంగా ఓ చీటింగ్ కేసు వెలుగుచూసింది. అప్పటికే ఓ న్యూస్ ఛానల్ సీఈవోగా వున్న ఓ వ్యక్తి మరింత డబ్బులకు ఆశపడి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేయడం ప్రారంభించాడు. ఇతనితోపాటు మరో నలుగురు కూడా కలిసి.. ఉద్యోగాల దందా చేయడం ప్రారంభించారు. ప్రముఖ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు ఆ ముఠా మాయమాటలు చెప్పి.. లక్షల్లో డబ్బులు దోచుకుంది. చివరికి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముఠా బండారం బయటపడింది. మోసాలకు పాల్పడుతున్న ఆ ఘరానా ముఠాను టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసుల సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది.

తార్నాకకు చెందిన 'టీ9' న్యూస్ ఛానల్ సీఈవో కె.మల్లలన్న అలియాస్ మల్లారెడ్డి, అబిడ్స్ లోని ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్టా పనిచేస్తున్న టి.రమేష్, సితాఫల్మండికి చెందిన నిరుద్యోగి బి.నగేష్ బాబు, సచివాలయ ఉద్యోగి డి.వెంకటేశ్వరరావు... నలుగురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. డబ్బులను తమ ఖాతాలో జమ చేసుకోవడానికి నిరుద్యోగులను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరు జెన్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వేణు, మహేష్లను నమ్మించారు. ఇందుకోసం రూ.10 లక్షలు అవుతుందని చెప్పి, అడ్వాన్స్గా రూ.2.5 లక్షలు తీసుకున్నారు. అంతేకాదు.. జెన్కోలో ఏఈ పోస్టుల పేరుతో మరికొందరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లయిన తర్వాత తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని డబ్బులు సమర్పించుకున్న బాధితులు ఆ ముఠాను సంప్రదించగా.. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడంటూ దాటవేస్తూ వచ్చారు. చివరకు తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్ రావు తెలిపారు.

ఆ ముఠాని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు వారు గతంలో చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా 2010లోనూ రైల్వేలో గ్రూప్-డి పోస్టులు ఇప్పిస్తామంటూ 10 మంది నుంచి రూ.10 లక్షలు వరకు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే.. ఆ మొత్తాన్ని నారయణగౌడ్ అనే వ్యక్తికి ఆ ముఠా ఇవ్వగా.. ఆ డబ్బుతో అతడు పరారైనట్లు విచారణలో వెల్లడించారు. అదనపు డీసీపీ విజయేందర్రెడ్డి పర్యవేక్షణలో ఈ నిందితుల్ని అరెస్టు చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.విక్రమ్దేవ్.. ఆ ముఠా నుంచి సుమారు రూ.2.68 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t9 news channel ceo mallareddy arrest  jobs cheating cases  

Other Articles