Sand to Modi from AP

Sand to modi from ap

AP, Modi, Sand, Congress, Raghuveera Reddy, APPCC, Modi brought sand, Sand to Modi, Modi on special status, special status, special package

AP congress leaders sent sand from AP. Modi also brought sand from parliament on Amaravati opening ceremony. central govt didnt give clarity on special status for ap.

ఏపి నుండి మోదీకి 'మట్టి' పార్సిల్

Posted: 11/18/2015 11:58 AM IST
Sand to modi from ap

ప్రధాని నరేంద్ర మోదీకి ఆ మధ్యన బీహార్ నుండి డిఎన్ఎ టెస్టులు పంపించినట్లే తాజాగా ఏపి నుండి మట్టి పార్సిల్ ను పంపించారు ఏపి కాంగ్రెస్ నాయకులు. ఎందుకు అంటే.. అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోదీ ప్రత్యేక హోదా మీద ఎలాంటి ప్రకటన చెయ్యకుండా కేవలం పార్లమెంట్ నుండి తీసుకువచ్చిన మట్టిని మాత్రేమే అందించారు.  అయితే ఎంతో ఆవతో కనీసం అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో అయినా మోదీ ప్రత్యేక హోదా మీదో లేదంటే కనీసం ప్రత్యేక ప్యాకేజీ మీదో ప్రకటన చేస్తారని అంతా అనుకున్నా నిరాశ మిగిల్చారు. అయితే తాజాగా తమ నిరసనను వెల్లడించాడానికి కాంగ్రెస్ నాయకులు మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.

Also read: మోదీని దెబ్బ తియ్యడానికి అతడితో చేతులు కలిపిన రాహుల్

మోదీకి ఏపి కాంగ్రెస్ నాయకులు మట్టిని పార్సిల్ చేస్తున్నారు. మట్టిని  మోదీకి పంపించడం ద్వారా ఏపికి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా మీద ఎలాంటి ప్రకటన రాకపోవడం మీద తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపి పిసిసి ప్రెసిండెంట్ రఘువీరా రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మట్టిని సేకరించి మోదీకి పంపించారు. ఇందిరాగాంధీ ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మట్టిని సేకరించి మోదీకి పంపించడం తనకు ఆనందంగా ఉందని రఘువీరారెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా మీద కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుందని రఘువీరా మండిపడ్డారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles