ISIS afraid of Hackers

Isis afraid of hackers

ISIS, hackers, Anonymous , Anonymous group, Anonymous Vs ISIS, Anonymous on ISIS, Anonymous tweets, Anonymous war, ISIS war, paris attack

The hacker group Anonymous claimed on Tuesday to have taken out 5,500 Twitter accounts linked to the Islamic State group, which claimed responsibility for the Paris attacks.The loosely organised hacking collective made the claim in a tweet one day after launching #OpParis campaign , which stepped up an earlier effort to shut down social media accounts of the organization.

వాళ్లంటే ఐఎస్ఐఎస్ కు హడల్

Posted: 11/18/2015 01:11 PM IST
Isis afraid of hackers

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మీద యుధ్దానికి ప్రపంచం సన్నద్దమవుతోంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. ప్యారిస్ దాడి తర్వాత ఫ్రాన్స్ తో పాటు రష్యా కూడా ఐఎస్ఐఎస్ మీద యుధ్దాన్ని ప్రకటించింది. రష్యా విమానాన్ని కూల్చింది కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కనుక తప్పక మూల్యం చెల్లించాల్సిందేనని... దానికి కారకులైన వారిని ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వదిలేది లేదని రష్యా అధ్యక్షుడు వాదిమ్లిర్ పుతిన్ ప్రకటించారు. అయితే ఇలా రష్యా, ఫ్రాన్స్ లు ప్రత్యక్ష యుద్దానికి దిగుతుంటే.. అసలు ఐఎస్ఐఎస్ ప్రపంచంలో ఎలా వ్యాపిస్తోంది అన్న అసలు మూలాల మీద దాడికి దిగుతున్నాయి సైబర్ సంస్థలు. హ్యాకింగ్ టెక్నాలజీని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థను అంతమొందించడానికి కంకణం కట్టుకుంది ఓ హ్యాకర్ గ్రూప్.

Also Read: అక్బరుద్దీన్ ఓవైసీ మాటల వల్ల ఉగ్రవాదిగా..

ప్రపంచంలో ఉన్న హ్యాకర్ గ్రూప్స్ లో యునినిమస్ హ్యాకర్ గ్రూప్ చాలా ప్రసిద్ది చెందింది. తాజాగా ప్యారిస్ దాడి తర్వాత ఆ సంస్థ ఐఎస్ఐఎస్ మీద యుద్దాన్ని ప్రకటించింది. మీరు మా నుంచి తప్పించుకోలేరు.. ఎంత మాత్రం అవకాశం లేనట్లుగా చేస్తాం.. సిద్దంగా ఉండండి అంటూ వీడియో ద్వారా యుధ్దానికి తెర తీసింది. అయితే దీని మీద ఐఎస్ఐఎస్ కూడా స్పందించింది. ఐఎస్ఐఎస్ ఈ హ్యాకర్ గ్రూప్ ను ఇడియట్స్ గా కొట్టివేసింది. అయితే యునానిమస్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ప్యారిస్ దాడికి లింక్ ఉన్న దాదాపు 5500 ట్విట్టర్ అకౌంట్లను గుర్తించినట్లు ఆ సంస్థ వెల్లడించింది,. అలాగే వాటిని డౌన్ చేస్తున్నట్లు కూడా తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. దాంతో అసలు ఐఎస్ఐఎస్ అసలు బలమైన సోషల్ మీడియా ప్రచారం మీద అప్పుడే నీలి నీడలు అలుముకున్నాయి. దాంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు హ్యాకర్ గ్రూప్ భయం పట్టుకుంది.


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles