Ramdevs Patanjali atta noodles have no approval

Ramdevs patanjali atta noodles have no approval

Baba Ramdev, Ram Dev baba Nodles, patanjai, Noodles, Maggi, Noodles from Patanjali, Patanjali company, Noodles from Patanjali trust

Central food safety regulator FSSAI on Wednesday said yoga guru Baba Ramdev-promoted FMCG venture Patanjali did not have approval for its newly-launched instant noodles, which the company has vehemently denied. Food Safety and Standards Authority of India (FSSAI) Chairperson Ashish Bahuguna said no approval or licence has been granted to Patanjali for its instant noodles.

రాందేవ్ బాబా నూడుల్స్ కు ఆదిలోనే అడ్డం

Posted: 11/19/2015 08:22 AM IST
Ramdevs patanjali atta noodles have no approval

మార్కెట్లో నూడిల్స్ మానియా నడుస్తున్నప్పుడు.. మ్యాగీ నూడుల్స్ మీద నిషేదం విధించడంతో బాబా రాందేవ్ తాను నూడుల్స్ ను తొందరలోనే మార్కెట్ లోకి తీసుకువస్తానని వెల్లడించారు. అయితే తాజాగా యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఎఫ్‌ఎంసీజీ వెంచర్ పతంజలి నూడుల్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రాకముందే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తాము ఆమోదించలేదని ఆహార భద్రత సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చైర్మన్ అశిష్ బహుగుణ స్పష్టం చేశారు. ఏదైన ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టకముందు తాము వాటిని ఆమోదించాల్సిన ఉంటుందని, ఆ తర్వాతనే రిటైల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సంస్థకు పెసులుబాటు లభించనున్నదన్నారు.

అయితే పతంజలి నూడుల్స్ విషయానికి వస్తే సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని అశిష్ బహుగుణ వెల్లడించారు. పతంజలి ఆయుర్వేద ఔషధాలకు అనుమతి ఉంది కానీ నూడుల్స్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పది సంస్థలకు చెందిన ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు విక్రయించేందుకు అనుమతి ఉంది. పతంజలి నిర్వాహకులు మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆహారభద్రత సంస్థ నుంచి కంపెనీకి చెందిన పాస్తాకు ఆమోదం పొందామని, నూడుల్స్ సైతం పాస్తా కిందకు వస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నారు. మరి చూడాలి మార్కెట్ లోకి బాబా రాందేవ్ నూడుల్స్ వస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles