Mayor muderers says thanks

Mayor muderers says thanks

mayor murder, Mayor Murder in chittoor, Chittoor mayor murder, Anuradha Murder, Police on Mayor Murder

In chittoor Mayor Anuragdha and her husnabd murdered by unknown persons. Police investingating the case. Police noticed that Murderers says thanks to some one , who near to Mayor at the time.

ధ్యాంక్స్ చెప్పిన మేయర్ హంతకులు

Posted: 11/19/2015 08:24 AM IST
Mayor muderers says thanks

చిత్తూరు మేయర్ హత్య కేసులో పోలీసులకు దిమ్మతిరిపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేయర్ దంపతుల హత్య.. వెను వెంటనే కొంత మంది హత్య చేసింది తామేనంటూ పోలీసులకు లొంగిపోవడం టకటక జరిగిపోయాయి. ఏపిలో సంచలనం రేపిన ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే మేయర్ ప్రత్యర్థి వర్గం వారు కావాలనే ఇలా చేసి ఉంటారని.. మేయర్ భర్త మోహన్ బావమరిది దీనికి ప్లాన్ వేశాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పోలీసులు మరో కీలక సమాచారాన్ని సేకరించారు. మేయర్ దంపతులను హత్య చేసిన తర్వాత హంతకులు అక్కడ ఉన్న ఒ వ్యక్తికి ధ్యాంక్స్ చెప్పారట. కొత్త వారికి మేయర్ ఛాంబర్ పూర్తిగా తెలియదు... మరి అలాంటిది మేయర్ ను హత్య చేసేందుకు.. హత్య తర్వాత హంతకులు పారిపోవడానికి అవకాశం కల్పించింది ఎవరు అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు.

మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే దుండగులు సంఘటన స్థలంలోనే ఉన్న ఓ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మేయర్ వర్గానికి చెందిన వాళ్లపై పో లీసులు దృష్టి సారించారు. కొత్త వ్యక్తులకు మేయర్ చాంబర్ ఎక్కడుందనే విషయం తెలియదు. ముసుగు ధరించి మేయర్ చాంబర్‌లోకి ముగ్గురు దుండగులు వెళుతున్న సమయంతో వాళ్ల కాళ్లకు మగాళ్ల చెప్పులు, బూట్లు కనిపించడంతో అప్రమత్తమైన మేయర్ అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మేయర్ అనుచరులు వారిని లోపలికి వెళ్లడానికి అనుమతించడారట. ఇక హత్య చేసిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ప్రధాన తలుపులు మూశారు. ఈ సమయంలో హంతకులు కార్యాలయం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. బాగా తెలిసిన వాళ్లే హంతకులు ఎక్కడి నుండి తప్పించుకోవచ్చో కూడా తెలియజేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles